ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలి
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:53 PM
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఎం నాయకులు ఏసురత్నం, రణధీర్, రజాక్‌లు పేర్కొన్నారు.
ఆత్మకూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఎం నాయకులు ఏసురత్నం, రణధీర్, రజాక్‌లు పేర్కొన్నారు. సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాపోరు యాత్ర పట్టణంలోని గరీబ్‌నగర్, స్వరాజ్‌నగర్, ఇందిరానగర్, సాయిబాబానగర్, అక్కిరాజుకాలనీ, పద్మావతినగర్‌లలో కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా ట్రూఆఫ్ చార్జీలపై పేరుతో రూ.20వేల కోట్ల విద్యుత ఛార్జీల భారాలను ప్రజలపై మోపడం సరికాదని అన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇసుక లభ్యమవ్వడం లేదని తెలిపారు. కొత్త మద్యం పాలసీ పేరుతో ఊరురా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి ప్రజలను మద్యానికి బానిసగా మారుస్తున్నారని ఆరోపించారు. 14న తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామ్‌నాయక్, నాగేశ్వరరావు, ఇస్మాయిల్, హుసేన, కిరణ్ ఉన్నారు.
Updated Date - Nov 11 , 2024 | 11:53 PM