ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లెల్లో సాగునీటి సంఘాల ఎన్నికల వేడి

ABN, Publish Date - Dec 11 , 2024 | 11:28 PM

సాగునీటి సంఘాల ఎన్నికలు ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడ్డాయి.

గాజులదిన్నె ప్రాజెక్టు

అభ్యర్థులను ప్రకటించి ముంద ంజలో ఉన్న టీడీపీ

సంశయంలో వైసీపీ

ఇరు పార్టీలలో అసంతృప్తి నాయకులను బుజ్జగించే యత్నాలు

గోనెగండ్ల, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల ఎన్నికలు ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఇక మూడో సారి ముచ్చటగా బుధవారం ఎన్నికల నోటిఫికేషన విడుదల అయింది. దీంతో పల్లెల్లో సాగునీటి సంఘాల ఎన్నికల వేడి రగులుకున్నది. గ్రామాలలో తమ వర్గానికి చెందిన వాడే సంఘం అధ్యక్షుడు కావాలని ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు అధిష్టానాల దగ్గర పట్టుపడుతున్నారు. ఇప్పటికే సాగునీటి సంఘాల ఎన్నికలకు గాను స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరడ్డి టీడీపీ తరపున పోటీ చేసే డబ్ల్యూఏ ప్రెసిడెంట్లను, టీసీ మెంబర్లను దాదాపు పేర్లను ఖారారు చేశారు. అయితే వైసీపీ నాయకులు కూడా ప్రతి సాగునీటి సంఘానికి పోటీ చేయాల వద్దా అనే సంశయంలో ఉన్నారు. వైసీపీలో కొందరు నాయకులు పోటీ చేయాలని, మరి కొందరు పోటీకి దూరంగా ఉండి ఎంపీటీసీ, సర్పంచ ఎన్నికల్లో సత్తా చాటుదాములే అంటున్నట్లు సమాచారం. వైసీపీ ముఖ్యులు కొందరు కార్యకర్తలతో ఆ పార్టీ నాయకులు సమాలోచనలు జరుపుతున్నారు. గోనెగండ్ల మండలంలో ఎల్లెల్సీ కింద ఎంఎల్‌ఎ్‌సపీ, పీడీ, డీపీ 86. డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు మూడు ఉన్నాయి. అలాగే గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, డోన నియోజకవర్గాలలోని గ్రామాల నుంచి 12 డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు 144 టీసీమెంబర్లు ఉన్నాయి. కాగా ఎమ్మిగనూరు నియోజకవర్గం జీడీపీ కింద ఐదు డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు ఉన్నాయి. గోనెగండ్ల సెక్షన కింద ఉన్న ఎల్లెల్సీ కాలువకు చెందిన మూడు డబ్ల్యూఏ ప్రెసిడెంట్‌లను, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన జీడీపీ డబ్ల్యూఏ ప్రెసిడెండ్లలకు ఎమ్మెల్యే బీవీ పేరు ఖరారు చేశారు. గోనెగండ్ల సెక్షన కింద ఎల్లెల్సీ కాలువ డబ్ల్యూఏకి వైసీపీ నుంచి పెద్దగా పోటీ లేక పోయినా జీడీపీ కింద ఉన్న ఐదు డబ్ల్యూఏ ప్రెసిడెంట్లకు మాత్రం పోటీ తీవ్రంగా ఉంటుందని ఆయకట్టు రైతులు అంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆశీస్సులు ఉన్నవారే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. సాగు నీటి సంఘాల ఎన్నికల పట్ల మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అంతగా ఆసక్తి చూపడం లేదని వైసీపీ నాయకులే అంటున్నారు. ఇక బుట్టారేణుక తో మాట్లాడి నేడోరేపో తమ అభ్యర్థులను పేరు ప్రకటిస్తామని వైసీపీ మండల నాయకులు తెలుపుతున్నారు. ఈనెల 14న ఎల్లెల్సీ సాగునీటి సంఘాలకు గోనెగండ్ల ఎంపీడీవో కార్యాలయం, టీబీపీ కార్యాలయంలో ఎన్నికలు జరుతాయి. అలాగే గాజులదిన్నె సాగునీటి సంఘాలకు గాజులదిన్నె ప్రాజెక్ట్‌ ఇరిగేషన కార్యాలయం ఎన్నికలు జరుతున్నట్లు అధికారులు తెలిపారు.

సాగు నీటి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

మంత్రాలయం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): సాగు నీటి సంఘాల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్‌ ఎస్‌.రవి అన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో సాగునీటి సంఘాల ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ మైనర్‌, మేజర్‌ సాగునీటి ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం సూచించిన మూడు పద్ధతుల్లో కొనసాగించాలన్నారు. ఎన్నికలపై నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. సమావేశంలో ఎంపీడీవోలు శోభారాణి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ వెంకట్రాముడు, ఎస్‌ఐ పరమేష్‌ నాయక్‌, వర ప్రసాద్‌, పుల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్లు జీకే గురురాజరావు, సరస్వతి, ఆర్‌ఐ ఆదాం, వీఆర్వోలు భీమన్నగౌడు, రాజు, నర్సప్ప, భీముడు, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 11 , 2024 | 11:28 PM