భార్యను నరికి చంపిన భర్త
ABN, Publish Date - Oct 03 , 2024 | 11:52 PM
అనుమానం పెనుభూతమై .. భర్తే కాలయముడిగా మారి భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు.
మారిపోయానంటూ నమ్మించి కడతేర్చిన వైనం ..
కొలిమిగుండ్ల, అక్టోబరు 3 : అనుమానం పెనుభూతమై .. భర్తే కాలయముడిగా మారి భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ దారుణ సంఘటన కొలిమిగుండ్ల మండలంలోని కనకాద్రిపల్లె గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన జయమ్మ కుమార్తె పార్వతి ఆలియాస్ లక్ష్మి(38)కి 19 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహనతో వివాహమైంది. కొన్నేళ్లు వీరి కాపురం సవ్యంగా సాగినప్పటికీ రామ్మోహనకు భార్య మీద అనుమానం మొదలై వేఽధించడం మొదలు పెట్టాడు. దీంతో 3ఏళ్ల క్రితం లక్ష్మి పుట్టినిల్లు కనకాద్రిపల్లెకు చేరుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. 3నెలల క్రితం రామ్మోహన కనకాద్రిపల్లెకు వచ్చి భార్య లక్ష్మితో కలిసి ఉంటానని, తాను పూర్తిగా మారిపోయానని నమ్మబలికాడు. కూతురు కాపురం బాగుపడుతుందని భావించిన కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు. రామ్మెహన 3నెలల నుండి డ్రైవర్ పనికి వెళుతున్నాడు. అయితే భార్య తప్పు చేస్తోందని భావించి, పగను పెంచుకొని బుధవారం అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి తరువాత గొడ్డలి, కత్తితో విచక్షణా రహితంగా దాడిచేసి హతమార్చి పారిపోయాడు. ఉదయం సీఐ రమేష్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గొడ్డలిని స్వాధీనం చేసుకొని, మృతురాలి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - Oct 03 , 2024 | 11:52 PM