ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐ-ప్యాక్‌ పోయింది.. ప్యాక్‌ మిగిలింది!

ABN, Publish Date - Sep 14 , 2024 | 04:43 AM

వైసీపీలో ఐ-ప్యాక్‌ పోయింది. ఇప్పుడు పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ (ప్యాక్‌) మాత్రమే మిగిలింది.

వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడిగా పెద్దిరెడ్డి

అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్యాక్‌ సభ్యుడిగా శుక్రవారం నియమించారు. దీంతో ఐ-ప్యాక్‌ టీంకు, దాని వ్యవస్థాపకులైన ప్రశాంత్‌ కిశోర్‌, రిషిరాజ్‌ సింగ్‌లకు పూర్తిగా ఉద్వాసన పలికినట్లయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలనూ పెద్దిరెడ్డికి కట్టబెట్టారు. బీజేపీ అనుబంధ విభాగానికి చెందిన ఆళ్ల మోహన్‌ సాయిదత్‌ను ఇటీవల పార్టీ నిర్మాణం కోసం సలహాదారుగా జగన్‌ నియమించిన సంగతి తెలిసిందే.

వైసీపీకి నలుగురు అధికార ప్రతినిధులు

వైసీపీ అధికార ప్రతినిధులుగా టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, జూపూడి ప్రభాకరరావు, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆరె శ్యామలను నియమిస్తూ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు రోజా, జూపూడి టీడీపీపై అడ్డగోలుగా విరుచుకుపడేవారు. ఇప్పుడు ఆ స్థాయిలో పాలకపక్షంపై రాజకీయ దాడి చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Sep 14 , 2024 | 07:28 AM

Advertising
Advertising