ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేదల జీవితాలు మార్చాలి

ABN, Publish Date - Jul 20 , 2024 | 04:22 AM

రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేదల జీవితాలను మార్చేలా ప్రభుత్వ విజన్‌ ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రతి సామాన్యుడికీ ఫలాలు అందాలి

సంపద సృష్టి విధానాలకు ప్రాధాన్యం

ఏఐ హబ్‌లుగా అమరావతి, వైజాగ్‌

వికసిత ఆంధ్రప్రదేశ్‌ కోసం విజన్‌-2047

నీతి ఆయోగ్‌తో భేటీలో చంద్రబాబు

అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న నిరుపేదల జీవితాలను మార్చేలా ప్రభుత్వ విజన్‌ ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో సీఎంతో నీతిఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. వికసిత్‌ భారత్‌-2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత ఆంధ్రప్రదేశ్‌-2047 కోసం ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై చర్చించారు. చంద్రబాబు తన గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్‌ ఆలోచనలను పంచుకున్నారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఏపీ పనిచేస్తుందన్నారు. ‘వికసిత ఆంధ్రప్రదేశ్‌ కోసం విజన్‌- 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలి. పేదరికం లేని సమాజం సాధించాలి. అమరావతి, విశాఖపట్నం ఏఐ హబ్‌లుగా రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రతి సామాన్యుడికీ ఫలాలు అందాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధానాలు ఉండాలి. రాయలసీమలో హార్టికల్చర్‌ ఆధారిత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారు. సంపద సృష్టికి దోహదపడే విధానాలకు విజన్‌ డాక్యుమెంట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి’ అని చంద్రబాబు అన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ డాక్యుమెంట్‌పై భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు, సమాలోచనలు జరిపి విడుదల చేయనున్నారు. సమావేశంలో మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

నేడు టీడీపీ ఎంపీల సమావేశం

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఇక్కడ జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన ఆయన నివాసంలో మధ్యాహ్నం 2.30గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చిస్తారు.

27న ఢిల్లీకి చంద్రబాబు

సీఎం చంద్రబాబు 27న ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ రోజున నీతి ఆయోగ్‌ సంస్ధ తన గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తోంది. దీనికి దేశంలోని ముఖ్యమంత్రులు అందరినీ ఆహ్వానిస్తోంది. దీనికి హాజరు కావాలని ఆయన నిర్ణయించారు.

Updated Date - Jul 20 , 2024 | 04:23 AM

Advertising
Advertising
<