పేరుకే జిల్లా కేంద్రం.. రోడ్లన్నీ గుంతలమయం
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:19 AM
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారులు నీటి మడుగులను తలపిస్తున్నాయి.
పుట్టపర్తిరూరల్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారులు నీటి మడుగులను తలపిస్తున్నాయి. పుట్టపర్తి నుంచి సూపర్ హాస్పెటల్ వెళ్లే ఫోర్‌లైన రోడ్డు పోలీసు పెరేడ్ మైదానం వద్ద భారీగా వర్షపు నీరు నిలుచి... మడుగును తలపిస్తోంది. రింగురోడ్డు మొత్తం గుంతలు.. గుంతలే... ప్రధాన రహదారి నుంచి ప్రశాంతి నిలయం వెళ్ళే వెస్టుగేట్ రోడ్డు సైతం ఘోరంగా... ప్రమాదకరంగా తయారైంది.
Updated Date - Oct 21 , 2024 | 12:19 AM