ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాముడు చూపిన బాట!

ABN, Publish Date - Apr 17 , 2024 | 04:07 AM

మాట కోసం రాజ్యాన్నే త్యజించేంత ధర్మాత్ముడు... సతి కోసం ఒక యుద్ధం చేసేంత సత్యసంధుడు... కోట్లలో ఒక్కడు ఏదో వాగాడని

మాట కోసం రాజ్యాన్నే త్యజించేంత ధర్మాత్ముడు...

సతి కోసం ఒక యుద్ధం చేసేంత సత్యసంధుడు...

కోట్లలో ఒక్కడు ఏదో వాగాడని

వదిలేయకుండా.. ఆ ఒక్కడి మాటకూ

విలువనిచ్చిన నిక్కమైన పాలకుడు!

ప్రజా బాంధవుడు... ఆదర్శ పాలకుడు! ఇన్ని సులక్షణాల సుగుణాభి రాముడి కథ విన్నాం!

చేసిన ప్రమాణాలు విడచిపెట్టి... కాసుల కోసం విలువలు వదిలిపెట్టి... కక్షలే లక్ష్యంగా గురిపెట్టి... స్వార్థం కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే నేటి పాలకులనూ చూస్తున్నాం! కలి కాలంలో పాలకులే పాతకులవుతారని ఊహించాడు కాబోలు... వివిధ సందర్భాల్లో పాలకులు, పాలన ఎలా ఉండాలో ఆ రాముడే స్వయంగా త్రేతాయుగంలో వివరించాడు. సుగ్రీవుడికి, భరతుడికీ ధర్మ పాలన గురించి వివరించాడు. ఆ రాముడి మాటలను ఈ ‘నవమి’ నాడు గుర్తుతెచ్చుకుందాం! సరైన పాలకుడినే ఎన్నుకుందాం!

రాజ్యం తనదే అయినప్పటికీ... ‘ఇష్టారాజ్యం’ కుదరదు. పాలకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు.. ధర్మ రక్షణ, సత్యపాలన! తాను ధర్మాన్ని పాటించాలి. ప్రజలనూ ధర్మ మార్గంలో నడిపించాలి.

రాజుకు అహంకారం ఉండకూడదు. అబద్ధాలు ఆడకూడదు. సంయమనంతో మెలగాలి. కాలయాపన కూడదు. అజ్ఞానులకు ప్రాధాన్యమిచ్చి వారి సలహాలు వినడం సరికాదు. అసమర్థులు, వ్యామోహపరులు, అవినీతిపరులను మంత్రులుగా నియమించుకోకూడదు.

విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు సత్వరం చక్కదిద్దడం పాలకుల విధి. వ్యాపారాలు, వృత్తులను ప్రోత్సహించాలి.

ప్రజలను బాధించి పన్నులు వసూలు చేయకూడదు. దయ, ధర్మంతో ఆలోచించి పన్నులు వేయాలి.

ప్రజలకు అందుబాటులో ఉండాలి. పారదర్శకత పాటించాలి. పాలకుడిగా తాను జరిపే చర్చలు, తీసుకునే నిర్ణయాలను ప్రజలకు తెలియజేయాలి.

ఇదీ.. రాముడంటే!

ధర్మం, న్యాయం, కరుణ, స్వీయ నియంత్రణ, మాటకు కట్టుబడటం, ధైర్యం, పరాక్రమం, విలువలు

ఇదీ రామరాజ్యం

సత్యం, సత్వర న్యాయం, వివక్షకు తావులేని సమానత్వం, క్రమశిక్షణ, సుఖ సంతోషాలు

Updated Date - Apr 17 , 2024 | 04:07 AM

Advertising
Advertising