ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

25ఏళ్ల ఆదాయాన్ని గత ప్రభుత్వం వాడేసింది

ABN, Publish Date - Nov 21 , 2024 | 04:04 AM

చట్టసభల పరిధిలోకి రాకుండా, వాటి అనుమతి లేకుండా గత ప్రభుత్వం రూ.వందల కోట్ల అప్పులు సేకరించి, ఖర్చు చేసిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.

శాఖల్లో తవ్వినకొద్దీ అప్పులు: పయ్యావుల ఫైర్‌

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): చట్టసభల పరిధిలోకి రాకుండా, వాటి అనుమతి లేకుండా గత ప్రభుత్వం రూ.వందల కోట్ల అప్పులు సేకరించి, ఖర్చు చేసిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. 25ఏళ్లలో రాబోయే ఆదాయాన్ని గత ప్రభుత్వం వాడేసిందని మండిపడ్డారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ రుణాలపై టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్న వేశారు. దీనికి పయ్యావుల సమాధానం చెబుతూ.. ఈ ఏడాది జూన్‌ నాటికే గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.9 లక్షల 74 వేల కోట్లుగా తేలాయని తెలిపారు. ఇప్పటికీ ఈ అప్పుల సంఖ్య రోజురోజుకీ ఒక్కో శాఖలో తవ్వినకొద్దీ పెరుగుతునే ఉన్నాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులు చైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.

మేం చెవిలో పువ్వులు పెట్టుకుని వినాలా?: బొత్స

ర్థికమంత్రి చెబుతున్న సమాధానంపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ‘మీరు చెప్పేదంతా మేం చెవిలో పువ్వులు పెట్టుకుని వినాలా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఉన్న అప్పులపై హౌజ్‌ కమిటీ వేయాలన్నారు. బొత్స వ్యాఖ్యలకు ఆర్థిక మంత్రి కౌంటర్‌ ఇచ్చారు. ‘బడ్జెట్‌పై సమాధానం చెప్పేటప్పుడు సభలో లేరుకదా.. అందుకే మళ్లీ చెబుతున్నా. వైసీపీ సభ్యులకు వాస్తవాలు వినే ఓపిక ఉండాలి. ’ అని పయ్యావుల ఘాటుగా వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 21 , 2024 | 04:04 AM