ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ABN, Publish Date - Dec 01 , 2024 | 11:45 PM

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న మధ్యంతర భృతిని ప్రకటించి జీవోను 117ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్‌.గోకారి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హచ.తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న మల్లు రఘునాథరెడ్డి

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న మధ్యంతర భృతిని ప్రకటించి జీవోను 117ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్‌.గోకారి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హచ.తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సలాంఖాన ఎస్టీయూ భవనలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.గోకారి అధ్యక్షతన 78వ వార్షిక సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ మెరుగైన పీఆర్‌సీ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారని, 12వ పీఆర్‌సీ అమలు చేయాల్సిన గడువు పూర్తయి 17 నెల లు ఆలస్యమైందన్నారు. వెంటనే 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించి పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు రూ.21వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, చెల్లింపులకు సంబంధించిన కార్యచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బోధనేతర కార్యక్రమాల భారం తగ్గిస్తామని చెప్పిన ప్రభు త్వం ఆచరణలో చూపడం లేదన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్‌ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు మెమో.నెం.57 మేరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన వర్తింపజేయాల్సి ఉండగా.. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. పురపాలక పాఠశాలలో ఎస్‌జీటీ సమానమైన పోస్టులను వెంటనే ఉన్నతీకరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి టీకే జనార్దన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు, వెంకటేశ్వర్లు, సుంకన్న, సీనియర్‌ నాయకులు, మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐఆర్‌ను ప్రకటించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టె కృష్ణయ్య,, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.కరుణానిధిమూర్తి కోరారు. ఆదివారం స్థానిక పీఆర్‌టీయు కార్యాలయంలో పీఆర్‌టీయు జిల్లా కౌన్సిల్‌ సమావేశం ఎనవీ కృష్ణారెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అంశాలను క్లియర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీఆర్‌టీయు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగీవ్రంగా ఎంపిక చేశారు. పీఆర్‌టీయు జిల్లా అధ్యక్షుడుగా ఎనవీ కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ధనుంజయను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వి.కృష్ణారెడ్డి, ఎల్‌.నాగమల్లేశ్వరరెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 11:45 PM