ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరవీరుల త్యాగాలు మరువలేనివి

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:51 AM

శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం మచిలీపట్నం పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమరవీరుల స్థూపం వద్ద మంత్రి రవీంద్ర ఎస్పీ ఆర్‌.గంగాధర్‌రావుతో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

-రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

-ఘనంగా పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):

శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం మచిలీపట్నం పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమరవీరుల స్థూపం వద్ద మంత్రి రవీంద్ర ఎస్పీ ఆర్‌.గంగాధర్‌రావుతో కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పోలీస్‌ శాఖను బలోపేతం చేసేందుకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో కొంత మంది పోలీస్‌ అధికారులు రాష్ట్రం పరువును దిగజార్చారన్నారు. పోలీసులు ధైర్యంగా తలెత్తుకుని తిరిగేలా కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. మత్తు పదార్థాలు, మహిళలను వేధించే విషయాల్లో కఠినంగా వ్యవహరి ంచాలని కోరారు. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఎస్పీ ఆర్‌.గంగాధర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఈ ఏడాది విధి నిర్వహణలో 210 మంది పోలీసులు అమరులయ్యారని, వారిలో కృష్ణాజిల్లాకు చెందిన 10 మంది ఉన్నారన్నారు. వీరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా పోలీసు సంక్షేమ నిధికి మంత్రి రవీంద్ర రూ.50 వేలు విరాళం ఇచ్చారు. కృష్ణాజిల్లాలోని పోలీస్‌ అమరవీరులకు చెందిన పది కుటుంబాలకు ఙ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎస్‌డీవీ ప్రసాద్‌, డీఆర్వో కె.చంద్రశేఖర్‌, ఆర్డీవో కె.స్వాతి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌ పాల్గొన్నారు. అనంతరం అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మచిలీపట్నం నగరంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీ టాకీసు సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు.

Updated Date - Oct 22 , 2024 | 12:52 AM