ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టైరు పేలి.. ట్రాక్టర్‌ బోల్తా

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:54 PM

టైరు పేలి ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

ట్రాక్టర్‌ బోల్తా

ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు

వెల్దుర్తి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): టైరు పేలి ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం వెల్దుర్తిలో చోటుచేసుకుంది. ఓర్వకల్లు మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్‌ నాపరాతి బండల లోడుతో గోరంట్ల మండలం ఎస్‌హెచ. ఎర్రగుడికి వెళుతోంది. శుక్రవారం తెల్లవారు జామున మార్గమధ్యంలో వెల్దుర్తి సమీపాన నక్కలమిట్ట (ఎగుమిట్ట) ఎక్కే సమయంలో ట్రాక్టర్‌ ఇంజన పెద్ద టైరు పేలిపోయి ట్రాక్టర్‌ అదుపు తప్పింది. ఎగువ మిట్ట కావడంతో లోడుతో ఉన్న ట్రాలీ పక్కకు బోల్తా కొడుతున్న సమయంలో డ్రైవర్‌ రామాంజనేయులు, ట్రాలీ మీద ఉన్న నాగేశ్వరరావు, కృష్ణ, మల్లికార్జునలు కిందకు దూకారు. నాపరాళ్లు మల్లికార్జున మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించారు. గాయపడిన వారిని అంబులెన్సలో వెల్దుర్తి సీహెచసీ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన మల్లికార్జున మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Nov 29 , 2024 | 11:54 PM