ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పత్తి రైతుల గోడు పట్టించుకోవాలి

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:17 AM

కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ పత్తి రైతుల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా సీసీఐ పెడుతున్న నిబంధనలను సడలించేలా చూడాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోరారు.

పెంచికలపాడు సీసీఐ కేంద్రం వద్ద రైతు సంఘం ప్రతినిధుల నిరసన

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ పత్తి రైతుల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా సీసీఐ పెడుతున్న నిబంధనలను సడలించేలా చూడాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోరారు. శనివారం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పెంచికలపాడులోని సీసీఐ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. జగన్నాథం మాట్లాడుతూ నకిలీ విత్తనాల వల్ల పూర్తిగా దిగుబడి తగ్గిపోయి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగులో రైతులకు పెట్టుబడి ఖర్చులను పరిగణనలోకి తీసుకుని క్వింటానికి రూ.10వేల మద్దతు ధరను అందించేందుకు సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి కృష్ణ నాయక్‌, పుల్లన్న, దొడ్డిపాడు బాషా, వెంకటేశ్వర్లు, రాముడు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:17 AM