ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్లలో వచ్చి నడిరోడ్డుపై కాల్పులు

ABN, Publish Date - Oct 21 , 2024 | 04:01 AM

అది శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం బస్టాండ్‌ ప్రాంతం. అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రెండు బైక్‌లపై నలుగురు వ్యక్తులు వచ్చి అక్కడ ఆగారు.

నలుగురు వ్యక్తులపై 3 రౌండ్ల కాల్పులు

శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం

పుట్టపర్తి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): అది శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం బస్టాండ్‌ ప్రాంతం. అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రెండు బైక్‌లపై నలుగురు వ్యక్తులు వచ్చి అక్కడ ఆగారు. కొద్దిసేపటికే రెండు కార్లు వచ్చాయి. వాటిలో నుంచి ఐదుగురు వ్యక్తులు కిందకు దిగడం.. బైక్‌ల వద్ద ఉన్నవారిపై నడిరోడ్డుపైనే తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరపడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో ద్విచక్రవాహనాల్లో వచ్చిన వారు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో వారు ఓ మూటను అక్కడే వదిలేశారు. కాల్పులు జరిపిన వారు ఆ మూటను స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. కార్లలో వచ్చిన వారు పోలీసు సఫారీ దుస్తుల్లో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో దొంగలపై పోలీసులు కాల్పులకు పాల్పడినట్లు గ్రామస్థులు భావించారు. కానీ, కార్లలో వచ్చిన వారు క్షణాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి.. బత్తలపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు.. తన బృందంతో రామాపురం గ్రామానికి చేరుకుని, ఘటనపై విచారించారు. ఆ రెండు కార్లు తెలంగాణకు చెందినవిగా గుర్తించారు. నకిలీ బంగారంతో మోసం చేసే తెలంగాణ దొంగల ముఠానే కాల్పులకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. డమ్మీ తుపాకులతో కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 04:01 AM