ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిండు గర్భిణిని కిందపడేసి.. కాలితో తన్ని!

ABN, Publish Date - May 06 , 2024 | 03:34 AM

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులను.

వైసీపీ నాయకుల రౌడీయిజం

వీధి దీపాలు వెలగడం లేదన్నందుకు దారుణం.. తొలుత భర్తను పిలిచి దాడి

అడ్డుకోబోయిన గర్భిణిపై తంబళ్లపల్లెలో దాష్టీకం

మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి భార్య ముందే దురాగతం

తర్వాత 20 వాహనాల్లో మళ్లీ రాక.. అడ్డుకున్న పోలీసులు

మదనపల్లె టౌన్‌, మే 5: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులను.. వీధి దీపాలు వెలగడం లేదని ప్రశ్నించిన నిండు గర్భిణిని నేలపై పడేసి, కాలితో తన్ని దుర్భాషలాడారు. అడ్డొచ్చిన ఆమె భర్త గొంతు పట్టుకుని దాడి చేశారు. ఈ ఘటనలో గర్భిణి అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలి కథనం మేరకు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి పోటీ చేస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆయన సతీమణి కవిత పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కూటగోళ్లపల్లెలో సర్పంచ్‌ సుదర్శన్‌రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన కల్యాణి ఇంటికి వెళ్లి.. వైసీపీకి ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా కల్యాణి(8 నెలల గర్భిణి) స్థానిక సమస్యలను ప్రస్తావించారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని, రాత్రిళ్లు చిన్నారులు బయట తిరగాలంటే భయంగా ఉందన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన వైసీపీ నాయకులు.. ఆ విషయం వదిలేసి కల్యాణిని దుర్భాషలాడారు. ఆమె భర్త మల్లికార్జునను పిలిపించమని చెప్పారు. కల్యాణి తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన మల్లికార్జునపై 10 మంది వైసీపీ నాయకులు దాడికి దిగి గొంతు పట్టుకున్నారు. అడ్డుకోబోయిన కల్యాణిని కింద పడేసి కాలితో తన్నారు.

ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి సతీమణి కవిత అడ్డు చెప్పకపోవడం గమనార్హం. వైసీపీ నాయకుల దాడిలో కల్యాణి అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. కల్యాణి భర్త మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ప్రచారానికి వచ్చి తన భార్యను, తనను కొట్టారన్నారు. వైసీపీ అభ్యర్థి ద్వారకనాథరెడ్డి సతీమణి సమక్షంలోనే తమపై దాడి జరిగిందని, కనీసం ఆమె అడ్డు చెప్పలేదన్నారు. సుదర్శన్‌రెడ్డి, మల్లిరెడ్డి వారి అనుచరులు దాడి చేశారని తెలిపారు. ఈ విషయమై ములకలచెరువు పోలీసులకు ప్రభుత్వాస్పత్రి అవుట్‌పోస్టు సిబ్బంది సమాచారం అందించారు. ఇదిలావుంటే, ఈ ఘటన జరిగిన గంట తర్వాత తమను నిలదీసిన వారిని చితకబాదేందుకు వైసీపీ వారు దాదాపు 20 వాహనాల్లో మళ్లీ కూటగోళ్లపల్లెకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని ఊరి బయటే అడ్డుకుని వెనక్కు పంపించేశారు.


బరితెగించిన వైసీపీ గూండాలు

గుంటూరు ఆటోనగర్‌లో దుకాణాలకు నిప్పు

పెదకాకాని, మే 5 : గుంటూరు ఆటోనగర్‌లో టీడీపీ సానుభూతి పరులకు చెందిన ఏడు దుకాణాలకు వైసీపీవారు ఆదివారం నిప్పు పెట్టారు. రెండు రోజుల క్రితం ఆటోనగర్‌లో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ఆటోనగర్‌ మైనార్టీలు పెద్దగా హాజరు కాలేదు. దీంతో ఆయన ఆటోనగర్‌లోని టీడీపీ సానుభూతిపరులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశంలోనే కొందరు నాయకులపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆటోనగర్‌ దుకాణాలకు సెలవు కావడంతో టీడీపీ సానుభూతిపరుల దుకాణాలకు నిప్పు పెట్టారు. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్‌ ఇంజన్లు వచ్చే లోపే పూర్తిగా 40 పాత కార్లు, విడి సామాన్లు కాలిపోయాయి. ఇది వైసీపీ ముష్కరుల పనేనని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బాధితులను టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్‌ పరామర్శించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Updated Date - May 06 , 2024 | 03:35 AM

Advertising
Advertising