ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తుగ్లక్‌ను ఒక్క బటన నొక్కి సాగనంపారు

ABN, Publish Date - Dec 11 , 2024 | 11:30 PM

తుగ్లక్‌ను ప్రజలు ఒక్క బటన నొక్కి ఇంట్లో కూర్చోపెట్టారని గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి

రెవెన్యూ సదస్సులో ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం

ఎన్టీఆర్‌, బీవీ విగ్రహాలు ఏర్పాటు చేసి పేదలకు పట్టాలు ఇస్తాం

కడిమెట్లలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

ఎమ్మిగనూరు/రూరల్‌, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తుగ్లక్‌ను ప్రజలు ఒక్క బటన నొక్కి ఇంట్లో కూర్చోపెట్టారని గత వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మిగనూరు మండల పరిధిలోని కడిమెట్ల గ్రామంలో ప్రత్యేక అధికారి డిప్యూటి కలెక్టర్‌ చిరంజీవి అధ్యక్షతన రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీవీ హాజరై మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రీ సర్వే పేరుతో ప్రజలు, రైతుల మధ్య తగాదాలు సృష్టించిందన్నారు. మన తాతలు సంపాదించిన భూములకు గత ప్రభుత్వంలో జగన తన ఫొటోను వేసుకున్నారని, ఆ ఆస్తి ఆయన సంపాదించిందా అని ప్రశ్నించారు. ఇది చాలదన్నట్లు రీ సర్వే తరువాత రాళ్లకు సైతం బొమ్మలు వేసుకుని ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. భూ తగాదాలు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచించి రెవిన్యూ సదస్సులు ఏర్పాటు చేశారన్నారు. అనంతరం కడిమెట్లలో ఇంటింటికి తిరిగి గ్రామస్థుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వైసీపీ నాయకులు తొందరపడాల్సిన అవసరం లేదని ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు.వైసీపీ నాయకులు మూడు, ఆరునెలలకు ఒకసారి వచ్చి రైతులగురించి ముసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకుల మాటలను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శేషఫణి, ప్రత్యేక అధికారి విజయ్‌ కుమార్‌, సబ్‌రిస్ర్టార్‌ శ్రీనివాసులు, టీడీపీ మండల నాయకులు విరుపాక్షి రెడ్డి, చెన్నారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, మురళీ, పార్లపల్లి మల్లికార్జున, చంద్రశేఖర్‌ రెడ్డి, సోమేశ్వరరెడ్డి, డీలర్‌ ఈరన్న, జగదీ్‌షలు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డికి గ్రామప్రజలు, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Dec 11 , 2024 | 11:30 PM