ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ నాయకుడి దౌర్జన్యం

ABN, Publish Date - Mar 25 , 2024 | 05:07 AM

చిట్టీ డబ్బు అడిగినందుకు వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆదివారం దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

చిట్టీ డబ్బు అడిగినందుకు దంపతులపై దాడి

స్టేషన్‌కు వెళ్తే ఎదురుకేసు పెడతామని బెదిరింపు

ఎట్టకేలకు కేసు నమోదు

ధర్మవరం, మార్చి 24: చిట్టీ డబ్బు అడిగినందుకు వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆదివారం దంపతులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధితుల కథనం మేరకు.. ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీనివాసులు, జ్యోతి దంపతులు కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. మండలంలోని వెంకటతిమ్మాపురం గ్రామ వైసీపీ ఎంపీటీసీ దేవరకొండ కవిత భర్త, ఆ పార్టీ నాయకుడు వెంకటస్వామి వద్ద శ్రీనివాసులు చిట్టీ వేశాడు. 8 చిట్టీలు గడిచాయి. చిట్టీని పాడడానికి శ్రీనివాసులు వెళ్లాడు. చిట్టీ చివరి వరకు అవకాశంలేదనీ, అంతవరకు వేచి ఉండాల్సిందేనని వెంకటస్వామి చెప్పడంతో శ్రీనివాసులు వదులుకున్నాడు. చిట్టీయే వద్దనుకున్నాడు. అప్పటి వరకు కట్టిన మొత్తాన్ని చిట్టీ పూర్తయ్యాకే ఇస్తానని వెంకటస్వామి చెప్పడంతో చేసేదిలేక శ్రీనివాసులు వేచి ఉన్నాడు. చిట్టీలన్నీ అయిపోయి ఆరునెలలు కావస్తున్నా.. వెంకటస్వామి సొమ్ము చెల్లించలేదు. వెంకటస్వామి కుటుంబం ధర్మవరంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో తమ డబ్బు ఇవ్వాలంటూ శ్రీనివాసులు, అతడి భార్య జ్యోతి.. వెంకటస్వామి వద్దకెళ్లారు. డబ్బు అడగ్గానే వెంకటస్వామి పేట్రేగిపోయాడు. ‘రేయ్‌.. నా ఇంటి వద్దకే వచ్చి, నన్నే డబ్బు అడుగుతావా? నేను ఎవరనుకున్నావ్‌? అధికార పార్టీ నాయకుడిని. నా ఇష్టం వచ్చినపుడు ఇస్తా, అడిగితే ఊరుకునేది లేదు’ అంటూ నానా దుర్భాషలాడాడు. ఏకంగా ఇనుపరాడ్లతో దంపతులపై దాడిచేసి, తీవ్రంగా గాయపరిచాడు. భయభ్రాంతులకు లోనైన దంపతులు.. వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అక్కడ కూడా ‘మీరు ఫిర్యాదు చేస్తే.. మీపై ఎదురు కేసు పెట్టిస్తామం’టూ వైసీపీ నాయకుడి అనుచరులు బెదిరింపులకు దిగినట్లు సమాచారం. దీంతో చేసేదిలేక దంపతులు ఇంటికి వెళ్లిపోయారు. విషయం బయటకు పొక్కడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భార్యాభర్తలను పిలిపించి, దాడి వివరాలు తెలుసుకుని, వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. వైసీపీ నాయకుడు వెంకటస్వామిపై కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 25 , 2024 | 05:07 AM

Advertising
Advertising