ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Post.. Post... : : వినబడని కేక.. పోస్ట్‌! పోస్ట్‌!!

ABN, Publish Date - Oct 09 , 2024 | 12:00 AM

పోస్ట్‌.. పోస్ట్‌.. ఈ అరు పు వినపడితే నాడు వీధి వీధంతా అలర్టయ్యేది. ట్రింగ్‌ ట్రింగ్‌మంటూ సెకిల్‌ బెల్‌ మోతతో ఆడాళ్లు మగాళ్లు అన్న తేడా లేకుం డా ఇళ్ల బయటకు వచ్చేసే వాళ్లు. కార్డు ముక్క, కవరు, మనీ ఆర్డరులాంటివైతే పర్వాలేదుగానీ టెలిగ్రామ్‌ వచ్చిందంటే బెదిరి పోయేవాళ్లు. ఎందుకంటే అప్పట్లో సాధారణంగా టెలిగ్రామ్‌ అంటే చావు కబురు తెచ్చిందనే లెక్క. మిలిటరీలో ఉన్న భర్త రాసే జాబు కోసం వారాలపాటు భార్య ఎదు రు చూపులు, కొడుకు పంపే మనియార్డురు కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు.. ఇలా ఎన్నెన్నో భావోద్వేగాలకు సంబంధించిన సమాచారాన్ని మోసుకొచ్చే ఆయన ఆ ప్రాంతానికి ఏకైక వార్తాహరుడు.

కలికిరి తపాలా కార్యాలయం

నాడు ఆ కేకతో వీధి వీధంతా అలర్ట్‌

ఉత్తరమా.. మనీ ఆర్డరు రాలేదా అంటూ వాకబు

భావోద్వేగాలతో పెనవేసుకున్న తపాలా శాఖ

ఆధునికత అందిపుచ్చుకోలేక.. అట్టడుగుకు

నేడు అంతర్జాతీయ తపాలా దినోత్సవం

కలికిరి, అక్టోబరు8: పోస్ట్‌.. పోస్ట్‌.. ఈ అరు పు వినపడితే నాడు వీధి వీధంతా అలర్టయ్యేది. ట్రింగ్‌ ట్రింగ్‌మంటూ సెకిల్‌ బెల్‌ మోతతో ఆడాళ్లు మగాళ్లు అన్న తేడా లేకుం డా ఇళ్ల బయటకు వచ్చేసే వాళ్లు. కార్డు ముక్క, కవరు, మనీ ఆర్డరులాంటివైతే పర్వాలేదుగానీ టెలిగ్రామ్‌ వచ్చిందంటే బెదిరి పోయేవాళ్లు. ఎందుకంటే అప్పట్లో సాధారణంగా టెలిగ్రామ్‌ అంటే చావు కబురు తెచ్చిందనే లెక్క. మిలిటరీలో ఉన్న భర్త రాసే జాబు కోసం వారాలపాటు భార్య ఎదు రు చూపులు, కొడుకు పంపే మనియార్డురు కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు.. ఇంటర్వ్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు.. ఇలా ఎన్నెన్నో భావోద్వేగాలకు సంబంధించిన సమాచారాన్ని మోసుకొచ్చే ఆయన ఆ ప్రాంతానికి ఏకైక వార్తాహరుడు. జనానికి ఆయనో హీరో. ఆయనే పోస్ట్‌ మ్యాన్‌. ఆయన వాహనం సైకిల్‌. సంచి నిండా రకరకాల ఉత్తరాలను మోసుకొచ్చే ఆ పోస్ట్‌ మ్యాన్‌ ఇప్పుడు లేడు. ఏడాదికో, రెండేళ్లకో ఒకసారి ఏటీఎం కార్డో, ఆధార్‌ కార్డో, పాన్‌కార్డ్‌, బ్యాంకు సిబ్బంది పంపే ఏటీఎం కార్డులు ఇచ్చి వెళ్లేందుకు మాత్రమే ఈ కాలం పోస్ట్‌ మ్యా న్‌లు పరిమితమయ్యారు.


కోటాను కోట్ల భారతీయులతో మమేకమై వెలిగి న తపాలా శాఖ ప్రస్తుతం ఓ చారిత్రక గుర్తుగా మిగిలిపోయేందుకు సమీపంలో ఉందా అన్న సందేహాలున్నాయి

దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర

భారత తపాలా శాఖ దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర. 1766లో భార త దేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ‘మెయిల్‌ కంపెనీ’ పేరుతో స్థాపించారు. కాలక్రమేణా ఆంగ్లేయులు దీన్ని ప్రజల మధ్య సమాచార మార్పిడి కోసం, ఆ తరువాత ప్రభుత్వం-ప్రజల మధ్య ప్రధానంగా గ్రామీణ ప్రజల సౌకర్యం కోసం విస్తరించారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో 23,344 పోస్ట్‌ ఆఫీసులుండగా 2016 నాటికి అవి 1,55,015కు చేరుకున్నాయి. ఇం దులో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే పాదుకున్నాయి. స్వాతంత్ర్యానంతరం ‘మెయిల్‌ కంపెనీ’ పేరు తంతి తపాలా శాఖగా మార్చారు. ఆ తరువాత తంతి (టెలిగ్రామ్‌, టెలిఫోన్‌) తీసేసి ఇండియా పోస్ట్‌గా మారింది. మనీ ఆర్డర్లు, టెలిగ్రామ్‌లు వంటి ఆకర్షణీయమైన సౌకర్యాలను విస్తృతం చేయడంలో అసామాన్య ఫలితాలను సాధించింది. సామాన్యుడైనా సమీప పోస్ట్‌ ఆఫీసుకు వెళ్లి టెలిఫోన్‌ చేసుకునే సౌకర్యం ఉండేది. టెలిగ్రామ్‌ కూడా పంపే వారు. అందుకే సామాన్యుల నుంచి ధనవంతుల వరకూ తపాలాను ఆదరించారు.


ఎక్కడి నుంచైనా దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా గురిచూసినట్లు తపాల సేవలు చేరడానికి 19101 రకాల పోస్టల్‌ పిన్‌ కోడ్‌లు ప్రవేశ పెట్టి ఘన విజయం సాధించిం ది. ప్రపంచంలో తొలిసారిగా బంకతో అంటించే స్టాంపులను మన తపాలా శాఖే ప్రవేశపెట్టింది.

కారుచౌకయిన సమాచార మార్పిడి

ప్రజల మధ్య సమాచార మార్పిడి కోసం ఐదు నయాపైసలకు దొరికే పోస్టు కార్డు ఇప్పుడు ధర కేవలం 50 పైసలు. రిప్లై కార్డు (రూ.1), ఇన్‌ల్యాండ్‌ లెటర్‌ (రూ.2.50), ఎన్వలప్‌ కవర్‌ (రూ.5) లాంటి వాటిని అందుబాటులో ఉంచి సామాన్య, మధ్యతరగతి, ధనవంతులందరికీ ఒకే విధమై న సేవలను అందిస్తోంది. వాడవాడలా, వీధి వీధినా పోస్టు బాక్సులను ఏర్పాటు చేసి వినియోగదారుల ముంగిట వసతులు కల్పించింది. ఏపీలో 57 సర్కిల్‌ కార్యాలయాలు, 1510 సబ్‌ పోస్ట్‌ ఆఫీసులు, 9101 బ్రాంచి పోస్ట్‌ ఆఫీసులు, 27,648 తపాలాపెట్టెలతో ఇప్పటికీ మనుగడ సాగిస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా పల్లె నుంచి పట్నం వరకూ 4,17,114 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1990ల్లో ఈ మెయిల్‌ ప్రాచుర్యంలోకి రాగానే తపా లా శాఖకు ఎదురు దెబ్బలు మొదలై.. అనంతరం వరుసగా వచ్చిన వాట్సాప్‌, టెలిగ్రాం తదితర మెసేజింగ్‌ యాప్‌లు, తదనంతరం పెచ్చరిల్లి న సోషల్‌ మీడియా ధాటికి తపాలాశాఖ ప్రాభవం మసకబారడం ప్రారంభమైంది.


మరో వైపు ప్రైవేటు కార్గో, కొరియర్‌ సర్వీసులు, పార్శిల్‌ రవాణాలు అన్నీ కలగలిసి తపాలా శాఖపై ముప్పేట దాడి చేశాయి. దీంతో దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర కలిగి రాజధాని ఢిల్లీ నుంచి గ్రామంలో గల్లీ వరకూ అత్యంత విస్తృతమైన నెట్‌ వర్క్‌తో ప్రజలతో నేరుగా అనుబంధాన్ని పెంచుకున్న తపాలా వ్యవస్థ ఇప్పుడు కుదేలైపోయింది.

పునర్వైభవం కోసం..

ప్రస్తుతమున్న మెయిల్‌ సర్వీసులను ఆధునీకరించి, తాజాగా డిజిటల్‌ పేమెంట్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటికి తోడు బ్యాంకింగ్‌ వ్యవస్థను కూడా మొదలు పెట్టింది. పబ్లిక్‌, ప్రైవేటు రంగం వంటి బ్యాంకింగ్‌ సర్వీసులన్నీ అందుబాటులోకి తెస్తోంది. పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు స్పందన లభిస్తోంది. సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్‌ వంటి పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి. రికరింగ్‌ డిపాజిట్లు, నెలవారీ ఆదాయ పథకాలు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీములు తదితరాలు తపాలాశాఖను ఆదుకు నే విషయంలో అనేక సందేహాలున్నా ఈ శాఖ పునర్వైభవం సాధించాలనే విషయంలో ప్రజలంతా నిస్సందేహంగా కోరుకుంటారు.

Updated Date - Oct 09 , 2024 | 12:00 AM