యురేనియం టెండర్లు రద్దు చేయాలి
ABN, Publish Date - Nov 22 , 2024 | 12:14 AM
ప్యాపిలిలో మండలంలో యురేనియం తవ్వకాల కోసం నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్యాపిలిలో సీపీఐ నాయకులు ఆందోళన చేశారు.
ప్యాపిలి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్యాపిలిలో మండలంలో యురేనియం తవ్వకాల కోసం నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్యాపిలిలో సీపీఐ నాయకులు ఆందోళన చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ ప్యాపిలి మండలంలోని జక్కసానికుంట్ల, రాంపురం, మామిళ్లపల్లి గ్రామాల్లో యురేనియం తవ్వకాల కోసం ప్రభుత్వం రూ.5వేల కోట్లతో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. యురేనియం తవ్వకాల వలన పర్యావరణం దెబ్బ తింటుందన్నారు. తవ్వకాల ద్వారా వచ్చే వాయువుతో వాతావరణం విషతుల్యంగా మారి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలను ఉమ్మడి జిల్లా మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, టీజీ భరత, ఎస్‌ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - Nov 22 , 2024 | 12:14 AM