ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధర్మారెడ్డికి ‘సెలవు’

ABN, Publish Date - Jun 11 , 2024 | 02:32 AM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డి నేటినుంచి వారం రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు.

నేటి నుంచి వారం పాటు మంజూరు

రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని షరతు

12న బాబు రాక నేపథ్యంలోనే నిర్ణయం

తిరుపతి జేఈవోకు అదనపు బాధ్యతలు

తిరుపతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డి నేటినుంచి వారం రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. సోమవారం ఆయన సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలని షరతు విధించింది. 12న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల రానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ధర్మారెడ్డికి టీటీడీ నుంచి ఉద్వాసన పలికినట్టేనని ప్రచారం జరుగుతోంది. రక్షణ శాఖకు చెందిన ఐడీఈఎస్‌ అధికారి ధర్మారెడ్డికి వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన రెండు పర్యాయాలు డెప్యుటేషన్‌పై టీటీడీలో ఓఎ్‌సడీగా తిరుమలలో కీలక అధికారిగా వ్యవహరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2019 నుంచి తిరిగి టీటీడీకి డెప్యుటేషన్‌పై వచ్చారు. తొలుత కొండపై జేఈవో పోస్టులో ఓఎ్‌సడీగా చేరినప్పటికీ తర్వాత ఆయన కోసమే ప్రభుత్వం ఆ పోస్టును అదనపు ఈవోగా అప్‌గ్రేడ్‌ చేసింది. తర్వాత ఈవోను కూడా సాగనంపి ఈవో ఫుల్‌ అడిషనల్‌ చార్జి కూడా ధర్మారెడ్డికే అప్పగించింది. దీంతో మొత్తం టీటీడీ వ్యవహారాలపై ఆయన పెత్తనం మొదలైంది. ఆ పోస్టును అడ్డుపెట్టుకుని పలు అంశాల్లో వైసీపీ ప్రభుత్వానికి, గత సీఎం జగన్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు అనేకం ఆయనపై ఉన్నాయి. న్యాయవ్యవస్థను సైతం ప్రభావితం చేయడానికి యత్నించారన్న తీవ్రస్థాయి ఆరోపణలు కూడా వచ్చాయి. జగన్‌తో సాన్నిహిత్యం కారణంగా విపరీతమైన అహంకారం ప్రదర్శించేవారని, అందులో భాగంగా తనపై విమర్శలకు దిగేవారికి దర్శనాలు కూడా లేకుండా చేసేవారన్న ఆరోపణలున్నాయి. బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డిని అలాగే వేధించారని, ఆయన్ను దర్శనానికి తీసుకెళ్లే సందర్భాల్లో కేంద్రమంత్రులను కూడా ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదులొచ్చాయి. ఈ క్రమంలో వైసీపీయేతర పార్టీలకు ఆయన దాదాపు శత్రువుగా మారారు. ధర్మారెడ్డిపై స్థానిక నేతల నుంచీ రాష్ట్ర నేతల వరకూ అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు రాక కారణంగానే...

వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ధర్మారెడ్డి సెలవుపై వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఆయన ఈ నెల 30న రిటైరు కానున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో హడావిడిగా సెలవు పెట్టారు. కానీ వైసీపీతో అంటకాగిన అధికారులు సెలవుపై వెళ్లడానికి కొత్త ప్రభుత్వం అంగీకరించలేదు. సెలవు కోసం పెట్టిన దరఖాస్తును తిరస్కరించి విధుల్లో కొనసాగాలని ఆదేశించింది. అయితే 12న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు అదే రోజు రాత్రికి తిరుమల రానున్నారు. 13న శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం హోదాలో చంద్రబాబు వచ్చినపుడు ఈవో హోదాలో ధర్మారెడ్డి స్వాగతం పలకడంతో పాటు దర్శనం, ఆశీర్వచనం సమయంలో సైతం సీఎం వెన్నంటి ఉండాలి. సీఎం తిరుగు ప్రయాణమయ్యే వరకూ అనుసరించాల్సి ఉంది. ధర్మారెడ్డి పట్ల చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న కారణంగా ఆయన వచ్చేటప్పటికి ఈవోగా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఆయనను సెలవుపై ముందస్తుగానే పంపివేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వారం పాటు సెలవు అంటే ఇక మళ్లీ టీటీడీలోకి తిరిగి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ధర్మారెడ్డి సెలవుపై వెళుతున్న క్రమంలో ఈవో బాధ్యతలను తిరుపతి జేఈవో వీరబ్రహ్మానికి అదనంగా అప్పగించారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 02:32 AM

Advertising
Advertising