ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: ఎన్నికలలో గెలుపు కోసం జగన్ ఆడిన డ్రామాయే కోడికత్తి దాడి

ABN, Publish Date - Jan 24 , 2024 | 01:49 PM

కోడికత్తి కేసులో శ్రీనుకు జరిగిన అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ రామకృష్ణ, టీడీపీ నేత వర్ల రామయ్య, ఫారూక్ షుబ్లీ, బాలకోటయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎన్నికలలో గెలుపు కోసం జగన్ ఆడిన డ్రామాయే కోడి కత్తి దాడి అని పేర్కొన్నారు.

విజయవాడ: కోడికత్తి కేసులో శ్రీనుకు జరిగిన అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ రామకృష్ణ, టీడీపీ నేత వర్ల రామయ్య, ఫారూక్ షుబ్లీ, బాలకోటయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఎన్నికలలో గెలుపు కోసం జగన్ ఆడిన డ్రామాయే కోడి కత్తి దాడి అని పేర్కొన్నారు. అమాయకుడైన శ్రీనును అన్యాయంగా బలి చేశారన్నారు. ఐదేళ్లుగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే సమయం జగన్‌కు లేదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు ఎందుకు జగన్‌పై ఒత్తిడి తేవడం లేదని నిలదీశారు. దళిత బిడ్డ జీవితాన్ని జగనే నాశనం చేశాడన్నారు.

‘‘నా ఎస్సీ, ఎస్టీ అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే.. తన తప్పు తెలిసిపోతుందనే భయం. అమాయకుడైన యువకుడి జీవితాన్ని నాశనం చేసిన జగన్‌కు దళిత వర్గాలు బుద్ధి చెప్పాలి. జునుపల్లి శ్రీను పొడవలేదు.. గుచ్చాడంటే.. అతని ఆలోచన అర్థం చేసుకోవాలి. జగన్ విదేశాలకు వెళ్లే సమయం ఉంది. కోర్టుకు వచ్చి తీరిక లేదంటే ఏమనుకోవాలి? రాష్ట్ర గవర్నర్‌ను కూడా కలిసి జరిగిన విషయాలు వివరించాలి. శ్రీనుకు న్యాయం జరిగే విషయంలో ఎటువంటి పోరాటాలు చేసినా టీడీపీ మద్దతుగా ఉంటుంది’’ అని వర్ల రామయ్య పేర్కొన్నారు.

జగన్ ఎందుకు కోర్టుకు రావడం లేదు?: రామకృష్ణ

కోడికత్తి కేసులో జునుపల్లి శ్రీనుకు అన్యాయం జరిగిందని అందరూ అంటున్నారు. ఆ సింపతీని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం స్పందించడం లేదు. శ్రీను ఎటువంటి తప్పు చేసినా కోర్టు ద్వారా శిక్షించవచ్చు. కానీ విచారణ చేయకుండా, బెయిల్ రానీయకుండా ఐదేళ్లుగా జైల్లో ఉంచారు. సాక్ష్యం చెప్పడానికి జగన్ కోర్టుకు ఎందుకు రావడం లేదు? జైలులో శ్రీను నిరాహారదీక్ష చేస్తున్నారంటే .. ఒత్తిడి పెంచుతారా? అని కొంతమంది న్యాయవాదులు అంటున్నారు. ఒక ముద్దాయి విచారణ సాగకుండా ఐదేళ్లు జైలులో ఉండటం ఎంతవరకూ న్యాయమో ఆ న్యాయవాదులు చెప్పాలి. అధికారంలో ఉన్న వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి రాకూడదని ఉందా?

12 కేసుల్లో జగన్ ముద్దాయిగా ఉన్నాడు.. ఆ కేసుల్లో కోర్టుకు కూడా రావడం లేదు. వేల కోట్లు డబ్బులు, అధికారం ఉంటే.. న్యాయ సూత్రాలు వర్తించవా? ఒక దళితుడు, పేదవాడు శ్రీను మాత్రం జైల్లో మగ్గిపోతున్నాడు. ఆ పేదవాడికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటో మేధావులు చెప్పాలి. వివేకానంద్ రెడ్డి హత్య కేసులో దోషులు ఎవరో.. అక్కడి పిల్లలను అడిగినా చెబుతారు. కానీ సీబీఐ వాళ్లు మాత్రం ఇంతవరకూ దోషులను పట్టికోలేక పోయారు. ప్రధాని మోదీ, జగన్‌లు కుమ్మక్కై ఈ కేసుల విషయంలో లాలూచీ పడి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది న్యాయవ్యవస్థకే సిగ్గుచేటు. ప్రజలు అసలు నమ్మాలా.. లేదా? అనే దానిపైనా చర్చ జరగాలి’’ అని సీపీఐ రామకృష్ణ అన్నారు.

Updated Date - Jan 24 , 2024 | 01:54 PM

Advertising
Advertising