ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎక్సైజ్‌లో వాసుదేవరెడ్డి మనుషులే

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:51 AM

గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారులకు ఎక్సైజ్‌ శాఖ సముచిత స్థానం కల్పించడం విమర్శలకు తావిస్తోంది.

ఆయనతో అంటకాగిన వారికి ముఖ్య స్థానాలు

ఎమ్మెల్యేల సిఫారసులతో కీలక పోస్టులు

సిఫారసు లేఖలివ్వడంపైనా అనుమానాలు

ఇలా అయితే పనితీరులో మార్పెలా?

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారులకు ఎక్సైజ్‌ శాఖ సముచిత స్థానం కల్పించడం విమర్శలకు తావిస్తోంది. మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి సన్నిహితులుగా గుర్తింపు పొందిన అధికారులకు బదిలీల్లో కీలక స్థానాలు లభించాయి. కొందరు అధికారులకు అందరికీమించి మంచి పోస్టులు రావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. నిజానికి గత వైసీపీ నేతలతో అంటకాగిన వారిని అప్రాధాన్య స్థానాలకు బదిలీ చేస్తారని లేదంటే అసలు పోస్టింగే ఇవ్వరని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అలాంటి వారే మంచి స్థానాలు దక్కించుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. గత ప్రభుత్వంలో నెల్లూరు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన కె. నాగమల్లేశ్వర్‌రెడ్డి.. వాసుదేవరెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరుంది. ఆయనపై ఓ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా నాగమల్లేశ్వర్‌రెడ్డికి కీలకమైన తిరుపతి ఈఎ్‌సగా పోస్టు దక్కింది. తిరుపతి జిల్లాలో ఓ ఎమ్మెల్యే సతీమణి ద్వారా సిఫారసు చేయించుకున్నట్లు తెలిసింది. సిఫారసు లేఖ అందగానే, ఈయనకు ఎక్సైజ్‌ శాఖ కీలక పోస్టు కట్టబెట్టింది. ఇక, వాసుదేవరెడ్డికి మరో సన్నిహితుడిగా పేరున్న ఈఎస్‌ గౌరీశ్వర్‌రావుకు విజయనగరం డిపో మేనేజర్‌ పోస్టు ఇచ్చారు. అది ఆయన సొంత జిల్లా. సిఫారసులతో ఆయనకు ఈ పోస్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పటి ఎండీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కె.వెంకట్రామిరెడ్డికి ఏలూరు డిపో మేనేజర్‌గా అవకాశం కల్పించారు. ఆయనకు అసలు పోస్టింగే ఇవ్వరనుకుంటే డీపో మేనేజర్‌గా నియమించడంతో అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాసుదేవరెడ్డి, కొంతకాలం అప్పటి ఎక్సైజ్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవతో అంటకాగిన శౌరిని తెనాలి డిపో మేనేజర్‌గా బదిలీ చేశారు. అప్పట్లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీకి కూడా తెలియకుండా విజయవాడలో కొన్ని ప్రభుత్వ మద్యం షాపులను శౌరి.. రీలొకేట్‌ చేశారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి అధికారులకు సిఫారసులు లేఖలు ఇచ్చిన వారిపై అనుమానాలు పెరుగుతున్నాయి.

Updated Date - Oct 21 , 2024 | 03:51 AM