AP News: ఎంపీ ఎంవీవీ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వెలగపూడి కౌంటర్..
ABN, Publish Date - Feb 17 , 2024 | 01:28 PM
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కౌంటర్ ఇచ్చారు. భూ భక్షకుడు ఎంవీవీ అని విమర్శించారు. అనేక కుంభకోణాల్లో ఆయన హస్తముందన్నారు. ఎంవీవీ భూకబ్జాలకు పాల్పడ్డారని స్వయానా విజయసాయి రెడ్డి గతంలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో వ్యాపారం చేయబోనని.. హైదరాబాద్ వెళతానన్న ఎంవీవీ మాట ఏమైందని ప్రశ్నించారు.
విశాఖపట్నం: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కౌంటర్ ఇచ్చారు. భూ భక్షకుడు ఎంవీవీ అని విమర్శించారు. అనేక కుంభకోణాల్లో ఆయన హస్తముందన్నారు. ఎంవీవీ భూకబ్జాలకు పాల్పడ్డారని స్వయానా విజయసాయి రెడ్డి గతంలో అన్న విషయాన్ని గుర్తు చేశారు. విశాఖలో వ్యాపారం చేయబోనని.. హైదరాబాద్ వెళతానన్న ఎంవీవీ మాట ఏమైందని ప్రశ్నించారు. తనపై హత్య కేసు ఉందని ఎంవీవీ అంటున్నారని.. ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిందని రామకృష్ణ బాబు అన్నారు.
ఎంవీవీకి దమ్ముంటే కేసును రి ఓపెన్ చేయించాలన్నారు. తనపై హత్య కేసు ఉందని ఎంపీ ఎంవీవీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు వేస్తానన్నారు. ఎన్‌టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి విశాఖలో యాదవులు టీడీపీకి వెన్నుదన్ను గా ఉన్నాని రామకృష్ణ బాబు అన్నారు. యాదవులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ టీడీపీ అని తెలిపారు. వంశీ క్రిష్ణ శ్రీనివాస్‌ను అవమనపరిచబట్టే పార్టీ మారారన్నారు. తాను.. వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కలిస్తే ఎంవీవీకి ఎందుకు బాధ అని రామకృష్ణ బాబు ప్రశ్నించారు. మద్యం వ్యాపారం చేసిన తనపై కల్తీ మద్యం కేసులు లేవన్నారు. ఎంపీ ఎంవీవీపై అనేక కేసులు ఉన్నాయన్నారు.
ఎంవీవీని సముద్రంలో కలపడానికి విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. భవిష్యత్‌లో జనసేన, టీడీపీ ప్రభుత్వంలో ఒక్క భూకబ్జా కూడా జరగదన్నారు. ఒకవేళ జరిగితే తాను వెంటనే రాజీనామా చేస్తానని తెలిపారు.ఎంవీవీకి దమ్ము ఉంటే రాజీనామా చేయగలరా? అని రామకృష్ణ బాబు ప్రశ్నించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే ఎంవివి చేసిన అక్రమాలపై విచారణ జరిపించి జైలుకు పంపించడం ఖాయమన్నారు.
యాదవ సామాజికవర్గం టీడీపీ నాయకుల కామెంట్స్...
‘‘ఎమ్మెల్యే వెలగపూడిపై ఎంపీ ఎంవీవీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎమ్మెల్యే వెలగపూడి ని విమర్శించే హక్కు ఆయనకు లేదు. యాదవ జాతిపై మాట్లాడటానికి ఎంవీవీ ఎవరు? ఇంకోసారి యాదవులను కించపరుస్తూ మాట్లాడితే చెప్పుతో కొడతాం. ఎంపీ ఎంవివి తక్షణమే యాదవ జాతికి క్షేమపణ చెప్పాలి’’ అని యాదవ సామాజికవర్గం టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
Updated Date - Feb 17 , 2024 | 01:33 PM