ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేంపాడు మేజర్‌ ఆయకట్టుకు సాగర్‌ జలాలు చేరేనా?

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:30 AM

నాగార్జున సాగర్‌, వేంపాడు మేజర్‌ ఆయకట్టుకు రబీలో సాగర్‌ జలాలు వచ్చేనా? లేదా? అని రైతులు ఆశ నిరాశలతో ఉన్నారు. వైసీపీ ప్రభు త్వం ఐదేళ్ల పాటు కనీస మరమ్మతులు చేయకపోవడంతో కాల్వలో చెట్లు, జమ్మి పెరిగి, భారీ వర్షాలకు గాళ్ళు పడి శిఽథిలావస్థకు చేరి నీరు నడిచే పరిస్థితి లేకుండా ఉంది.

వేంపాడు మేజర్‌ కాల్వ

వైసీపీ హయాంలో కనీస మరమ్మతులు లేవు

శిథిలావస్థకు చేరిన వేంపాడు మేజర్‌ కాల్వ

చాట్రాయి, నవంబరు 23: నాగార్జున సాగర్‌, వేంపాడు మేజర్‌ ఆయకట్టుకు రబీలో సాగర్‌ జలాలు వచ్చేనా? లేదా? అని రైతులు ఆశ నిరాశలతో ఉన్నారు. వైసీపీ ప్రభు త్వం ఐదేళ్ల పాటు కనీస మరమ్మతులు చేయకపోవడంతో కాల్వలో చెట్లు, జమ్మి పెరిగి, భారీ వర్షాలకు గాళ్ళు పడి శిథిలావస్థకు చేరి నీరు నడిచే పరిస్థితి లేకుండా ఉంది. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలో జోన్‌–3లో వేంపాడు మేజర్‌ కాల్వ ఉంది. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం రామచంద్రపురం 21 బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద ప్రారం భమై ఏలూరు జిల్లా చాట్రాయి, ముసునూరు, నూజివీడు, బాపులపాడు, పెదపాడు మీదుగా పెదవేగి మండలంలో ముగుస్తుంది. మొత్తం కాల్వ పొడవు 53 కిలోమీటర్లు కాగా ఆయకట్టు 36 వేల ఎకరాలు ఉంది. రబీ పంటలకు డిసెంబరులో నీరు విడుదల చేయాల్సి ఉండగా, ఇంకా ఎన్నెస్పీ అధికారులు కాల్వకు తాత్కాలిక మరమ్మతులపై దృష్టి సారించలేదు. వేంపాడు మేజర్‌ ఆయకట్టు కింద రబీలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. చెరువుల్లో సాగర్‌ జలాలు నింపితే భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి రబీ పంటకు ఢోకా ఉండదని రైతులు భావిస్తుండగా, వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఉండవని ప్రజలు అంటు న్నారు. ప్రభుత్వం వేంపాడు మేజర్‌ కాల్వకు మరమ్మతులు చేయించి ఆయకట్టుకు సాగర్‌ జలాలు విడుదల చేయాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. ‘ఎన్నెస్పీ వేంపాడు వేజర్‌ కాల్వకు అవసరమైన చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేసి నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తాం. డిసెంబరు 1 నుంచి నీరు విడుదలకు చర్యలు తీసుకుంటా’మని ఈఈ కె.గోపీనాథ్‌ తెలిపారు.,

సాగర్‌ జలాలు విడుదల చేయాలి

ఎన్నెస్పీ వేంపాడు మేజర్‌ కాల్వకు సాగర్‌ జలాలు విడుదల చేస్తే రబీ పంట లు పండటంతో పాటు, వేసవిలో తాగు నీటి ఇబ్బందులు తీరతాయి. ప్రభుత్వం స్పందించి నీరు విడుదలకు చర్యలు తీసుకోవాలి

– కలకొండ భాస్కరరావు, రైతు, జనార్దనవరం

Updated Date - Nov 24 , 2024 | 12:31 AM