ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బదిలీల్లో బాధితులు

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:13 AM

జిల్లా గృహనిర్మాణ శాఖ బదిలీల్లో గందరగోళం నెలకొంది. నెల రోజుల క్రితం జిల్లాలో జరిగిన వర్క్‌ ఇనస్పెక్టర్లు, కంప్యూటర్‌ అపరేటర్ల బదిలీలు ఆ శాఖ ఉద్యోగుల్లో అయోమయాన్ని సృష్టించాయి.

నిర్మాణ దశలో ఉన్న గృహాల వద్ద లబ్ధిదారులతో మాట్లాడుతున్న గృహ నిర్మాణ శాఖ సిబ్బంది

గృహ నిర్మాణ శాఖలో గందరగోళం

ఉన్నతాధికారుల ఉత్తర్వులు చెల్లవట?

సమస్యను నాన్చుతున్న అధికారులు

కర్నూలు, రాజ్‌విహార్‌ సర్కిల్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా గృహనిర్మాణ శాఖ బదిలీల్లో గందరగోళం నెలకొంది. నెల రోజుల క్రితం జిల్లాలో జరిగిన వర్క్‌ ఇనస్పెక్టర్లు, కంప్యూటర్‌ అపరేటర్ల బదిలీలు ఆ శాఖ ఉద్యోగుల్లో అయోమయాన్ని సృష్టించాయి. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన గృహనిర్మాణ శాఖ పీడీ సిద్ధలింగమూర్తి దాదాపు 24 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 11 మంది వర్క్‌ ఇనస్పెక్టర్లు, 13 మంది అపరేటర్లు ఉన్నారు. ఆ తరువాత ఆయన ఇక్కడి నుంచి మాృత శాఖకు బదిలీపై వెళ్లారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా బదిలీలు అయిన వెంటనే సంబంధిత ఉద్యోగులు తమకు నూతనంగా కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరి, దాదాపు 15 రోజుల పాటు అక్కడ పనిచేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ బదిలీలు చెల్లవని, వీటిని అమలు చేయటం కుదరదంటూ కార్యాలయ వర్గాలు కొర్రీ వేసి, వారిని పూర్వ స్థానాలకే వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఆ ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు.

ఉన్నతాధికారుల ఉత్తర్వులు చెల్లవా?:

దీర్ఘకాలికంగా ఒకే స్థానంలో పాతుకపోయిన ఉద్యోగులను కదిలించటతో పాటు, దూర ప్రాంతంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఎంతో కొంత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో వారి విన్నపం మేరకు పీడీ ఈ బదిలీలను చేపట్టారు. కానీ ఈ ఉద్యోగులకు ఉత్తర్వు కాపీలను అందజేసిన ఉన్నతాధికారులు, వాటిని బాధ్యులైన అధికారులకు అందజేయటంలో తాత్సారం చేశారు. ఆ తర్వాత పీడీ బదిలీ అయ్యారు. దీంతో సమస్య జటిలంగా మారింది. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రానందున విధుల్లో చేర్చుకోలేమని ఉద్యోగులకు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో బదిలీ అయిన ఉద్యోగులు పాత స్థానానికి దూరమై, కొత్త పోస్టులో చేరలేక నానా ఇబ్బందులు పడుతున్నా రు. వీరు చేరాల్సిన స్థానాలలో అప్పటికే ఉన్న సిబ్బంది అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక బదిలీ అయిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

నాన్పుడు ధోరణితో నష్టం:

ఉద్యోగుల అభిప్రాయాలు, అవసరాలు, అభ్యర్థన మేరకు జరిగిన బదిలీల్లో సాంకేతిక తప్పిదంతో బదిలీ అయిన వాళ్లు త్రిశంకు స్వర్గంలో ఉండే పరిస్థితి ఏర్పడింది. వాళ్లను పాత, కొత్త స్థానాలకు తిప్పుతూ వేదనకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే సమస్య కొలిక్కివస్తోంది. కానీ వారు ఏ నిర్ణ యం తీసుకోకుండా నాన్చివేత వైఖరితో ఉన్నారు. పీడీ పరిధిలో తేల్చాల్సిన అంశాన్ని కలెక్టర్‌ పేరుతో ఎటూ తేల్చడం లేదనే పలు విమర్శలకు తావిస్తోంది. దీని వల్ల గృహ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వంద రోజుల ప్రణాళిక లక్ష్యం నీరు గారుతోంది. ఉన్నతాధికారులంతా కలిసి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని వినతిపత్రాన్ని నివేదించటం కొసమెరుపు.

ఫ ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం

ఎన్టీయార్‌ గృహ నిర్మాణానికి సంబంధించి ఇంటింటి సర్వే ఇంకా అసంపూర్తిగా ఉండటంతో ఆ పనులు పూర్తికాగానే బదిలీల అంశాన్ని ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికే ఈ విషయమై ఇనఛార్జి పీడీ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే అర్హులైన వారందరికీ బదిలీలు జరిగేలా చర్యలు తీసుకుంటాం.

- మద్దయ్య, గృహనిర్మాణ శాఖ మేనేజర్‌, కర్నూలు

Updated Date - Nov 24 , 2024 | 12:13 AM