ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భీమిలి బీచ్‌ భూములపై విజయసాయి పంజా

ABN, Publish Date - Aug 01 , 2024 | 04:24 AM

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిది వింత వైఖరి. పార్టీ అధినాయకుడి మాదిరిగానే ఏమైనా అంటే సహించలేని తత్వం.

ఇతరులు చేస్తే తప్పు...వైసీపీ చేస్తే ఒప్పు!

ఆక్రమణలంటూ నాడు విశాఖ-భీమిలి రోడ్‌లో ప్రైవేట్‌, టీడీపీ ఆస్తుల కూల్చివేత

కానీ అక్కడే విజయసాయి నిర్మాణపనులు

భీమిలి బీచ్‌లో కుమార్తె పేరిట భూమి కొనుగోలు

కొత్త ప్రభుత్వంలో మొదలైన చర్యలు

అక్కడ నిర్మాణం కుదరదని తేల్చేసిన కోర్టు

జీవీఎంసీ నోటీసుపై సాయిరెడ్డి కుటుంబం కారాలు.. మిరియాలు..

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిది వింత వైఖరి. పార్టీ అధినాయకుడి మాదిరిగానే ఏమైనా అంటే సహించలేని తత్వం. అందరినీ వారే ఇబ్బంది పెట్టాలి. ఎవరైనా తప్పుబడితే మాత్రం తట్టుకోలేరు. సచ్ఛీలురమని నిరూపించుకోవడానికి తాపత్రయపడతారు. ఈ కేసు అలాంటిదే. ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డి విశాఖలో పనిచేసిన కాలంలో టీడీపీ సానుభూతిపరులను ఎంతో వేధించారు. విశాఖ నుంచి భీమిలి వరకు బీచ్‌ పక్కన వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారిని అక్కడి నుంచి లేపేశారు. పొక్లెయిన్లు పెట్టి విధ్వంసం చేశారు. గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథానికి చెందిన గో కార్టింగ్‌, అలాగే సీ హార్స్‌ రెస్టారెంట్‌ కూల్చేశారు.

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన స్థలంలో ప్రహరీలు తొలగించారు. వీటిని నిబంధనల ప్రకారం చేసినట్టు ప్రకటించారు. ఆ తరువాత అదే విజయసాయిరెడ్డి భీమిలిలో టౌన్‌ సర్వే నంబర్లు 1516, 151, 1519, 1523లలో ఆక్వా కల్చర్‌ చేస్తున్న వారి నుంచి సుమారు 3.5 ఎకరాల భూమిని అవియాన్‌ రియల్టర్స్‌ పేరుతో కొనుగోలు చేశారు. ఇది ఆయన కుమార్తె నేహారెడ్డికి చెందిన సంస్థ. ఈ భూమి అంతా భీమిలిలో బీచ్‌ను ఆనుకొని కేవలం 30 మీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడ పక్కా నిర్మాణాలు చేపట్టాలంటే సీఆర్‌జెడ్‌, ఏపీసీఎంజెడ్‌, ఇరిగేషన్‌ శాఖల అనుమతి అవసరం. కానీ అటువంటి అనుమతులు ఏమీ లేకుండానే, ప్రభుత్వం తమదేనన్న ధీమాతో చదును చేయించారు. ఈ భూమి సీఆర్‌జెడ్‌-1 పరిధిలోకి వస్తుంది. అక్కడ ఇసుక తిన్నెలు కదిలించకూడదు. కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ ఆయన చేపట్టారు. ఈ స్థలానికి రోడ్డుకు అవతల వర్షపు నీరు బీచ్‌లో కలిసేందుకు మార్గం ఉండేది. దానిని మూసేశారు. అటువైపు ఎవరూ రాకుండా ‘జీవీఎంసీ వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’ అంటూ బోర్డు పెట్టారు. అంటే అక్కడ ప్రభుత్వమే పనులు చేస్తోందని, ప్రైవేటు వ్యక్తులు కాదని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలా అనేక పనులు చేయడంతో జనసేన నేత పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. సీజే ధర్మాసనం దానిని పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టకూడదని, వాటిని తొలగించాలని ఆదేశించింది. దాంతో జీవీఎంసీ అధికారులు ఈ నెల 18న కూల్చివేతకు నోటీసులు ఇచ్చారు. ఆ నిర్మాణాలు కూల్చివేయడం తగదని స్టేటస్‌ కో ఇవ్వాలని నేహారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టంచేసింది.

స్టార్‌ హోటల్‌ కట్టాలని యోచన?

ఆ స్థలంలో రాడిసన్‌ బ్లూ మాదిరిగా సెవెన్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించాలని సాయిరెడ్డి అండ్‌ కో ప్రణాళిక వేసిందని, పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే రుషికొండలో నిర్మాణం చేపట్టినట్టే....ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించి పనులు చేసేవారని వైసీపీ వర్గాలే అంటున్నాయి.

Updated Date - Aug 01 , 2024 | 04:24 AM

Advertising
Advertising
<