ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లివిటిలో ఏడాదిలో 16 మంది శిశువులు మృతి

ABN, Publish Date - Nov 30 , 2024 | 10:40 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీ పరిధిలోని లివిటి గ్రామంలో గత ఏడాది కాలంలో 16 మంది శిశువులు మృతిచెందినట్టు అరకులోయ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్‌ చపాలి శంకర్‌, ఉప సర్పంచ్‌ మోహన్‌బాబు తెలిపారు.

లివిటి గ్రామానికి చెందిన శిశువు మృతి

హుకుంపేట, నవంబరు 30 (ఆంధ్రజోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప పంచాయతీ పరిధిలోని లివిటి గ్రామంలో గత ఏడాది కాలంలో 16 మంది శిశువులు మృతిచెందినట్టు అరకులోయ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్‌ చపాలి శంకర్‌, ఉప సర్పంచ్‌ మోహన్‌బాబు తెలిపారు. గ్రామానికి చెందిన మోహన్‌బాబు, మీనా దంపతుల మూడు నెలల కుమారుడు పాడేరు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. రెండు, మూడు రోజులుగా పాలు తాగకపోవడంతో శుక్రవారం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ బిడ్డ మృతిచెందాడని తల్లిదండ్రులు మోహన్‌బాబు, మీనా తెలిపారు. లివిటి గ్రామంలో గడ ఏడాది కాలంలో 16 మంది నెలల శిశువులు మరణించారని శంకర్‌, మోహన్‌బాబు తెలిపారు. అందుకు గల కారణాలు ఏమిటో వైద్య నిపుణుల ద్వారా తెలుసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 10:40 PM