జిల్లాకు 850 పశువుల గోకులం షెడ్లు మంజూరు
ABN, Publish Date - Jun 21 , 2024 | 12:26 AM
జిల్లాకు 850 పశువుల గోకులాల షెడ్లు మంజూరు అయినట్టు పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీడైరెక్టర్ నరసింహ తెలిపారు.
పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ నరసింహ
కోటవురట్ల, జూన్ 20: జిల్లాకు 850 పశువుల గోకులాల షెడ్లు మంజూరు అయినట్టు పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీడైరెక్టర్ నరసింహ తెలిపారు. గురువారం స్ధానిక మండల పరిషత్ సమవేశమందిరంలో మాకవరపాలెం, కోటవురట్ల మండలాలకు చెందిన పశుసంవర్థక శాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోకులాల షెడ్లు పశువులు పెంపకందారులకు మాత్రమే మంజూరు చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి 40 నుంచి 45 వరకు గోకులాల షెడ్లు కేటాయిస్తామన్నారు. ఈ సీజన్‌లో అధికంగా పశువులకు గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు సోకే ప్రమాదం వుందన్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏడీ సింహద్రప్పడు, వైద్యులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2024 | 12:26 AM