గిరిజనాభివృద్ధికి పెద్దపీట
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:43 AM
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో తీవ్ర అన్యాయానికి గురైన అడవి బిడ్డలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి సంబంధించి మంగళవారం అమరావతిలో నిర్వహించిన సమీక్షలో గిరిజనులకు తమ ప్రభుత్వం చేపట్టబోయే చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించి రద్దు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం విధిగా పునరుద్ధరిస్తుందని, అడవి బిడ్డల జీవనోపాదులను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.
రద్దయిన అడవి బిడ్డల పథకాల పునరుద్ధరణ
గిరిజన సంక్షేమంపై జరిగిన సమీక్షలో
ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
వైసీపీ నిర్వీర్యం చేసిన ట్రైకార్,
ఐటీడీఏ, జీసీసీ బలోపేతానికి నిర్ణయం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో తీవ్ర అన్యాయానికి గురైన అడవి బిడ్డలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి సంబంధించి మంగళవారం అమరావతిలో నిర్వహించిన సమీక్షలో గిరిజనులకు తమ ప్రభుత్వం చేపట్టబోయే చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు సంబంధించి రద్దు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం విధిగా పునరుద్ధరిస్తుందని, అడవి బిడ్డల జీవనోపాదులను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఐసీడీఎస్, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి సైతం గిరిజనుల సమగ్రాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి గిరిజనుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మారుమూల పల్లెలకు అత్యవసర సేవలు అందించే ఫీడర్ అంబులెన్స్‌ల వ్యవస్థ బలోపేతం, విస్తరణ, గర్భిణులకు వసతి గృహాలు ఏర్పాటు, ఎన్‌టీఆర్ విద్యోన్నతి, అంబేడ్కర్ ఓవర్ సీస్ విద్యానిధి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ వంటి విద్యా పథకాలను పునరుద్ధరించి, పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వైసీపీ నిర్వీర్యం చేసిన ట్రైకార్, ఐటీడీఏ, జీసీసీ వంటి సంస్థలను బలోపేతం చేసి, వాటి ద్వారా గిరిజనులకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.
Updated Date - Jul 31 , 2024 | 12:44 AM