ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షంతో సేదతీరిన నగరం

ABN, Publish Date - Sep 20 , 2024 | 01:13 AM

వారం రోజుల నుంచి మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులు గురువారం సాయంత్రం కురిసిన వర్షంతో సేదదీరారు. ఉదయం పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి.

మధురవాడలో పల్లపు ప్రాంతాలు జలమయం

గంభీరంలో 60.5, మధురవాడ వాంబే కాలనీలో 55, ఎండాడలో 50.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

వారం రోజుల నుంచి మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులు గురువారం సాయంత్రం కురిసిన వర్షంతో సేదదీరారు. ఉదయం పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. పది గంటల నుంచి మళ్లీ ఎండ పెరిగింది. మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఐదు నిమిషాలపాటు మళ్లీ జల్లులుపడ్డాయి. ఆ తరువాత మళ్లీ మామూలే. అయితే సాయంత్రం నాలుగు గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీవర్షం కురిసింది. నగరం కంటే శివారు ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తర భాగంలో కంబాలకొండ నుంచి ఆనందపురం వరకూ మంచి వర్షం కురిసింది. మధురవాడలో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. ఆనందపురం మండలం గంభీరంలో 60.5 మిల్లీమీటర్లు, మధురవాడ వాంబే కాలనీలో 55, ఎండాడలో 50.25, మధురవాడలో 48.5, పెందుర్తిలో 36.5, కంబాలకొండలో 34.25 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Updated Date - Sep 20 , 2024 | 01:13 AM