ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పడకేసిన పనులు

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:43 PM

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి బ్రేక్‌ పడింది. పనులకు సంబంధించి సుమారు రూ.8 కోట్ల బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది.

పనులు నిలిచిపోయిన వంద పడకల ఆస్పత్రి ప్రధాన భవనం

చింతపల్లి వంద పడకల ఆస్పత్రి నిర్మాణాలకు బ్రేక్‌

నిర్మాణ సంస్థకు రూ.8 కోట్ల బిల్లులు విడుదల చేయని గత వైసీపీ ప్రభుత్వం

అర్ధాంతరంగా నిలిచిన పనులు

వసతి సమస్యతో వైద్యులు, రోగుల అవస్థలు

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

చింతపల్లి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి బ్రేక్‌ పడింది. పనులకు సంబంధించి సుమారు రూ.8 కోట్ల బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. ఆస్పత్రి నూతన భవనాలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయోనని వైద్యులు, రోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం లోనైనా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

చింతపల్లి వంద పడకల ఆస్పత్రిని 2018లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. తొలుత ఏపీఆర్‌ కళాశాల దిగువన ఐదు ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఈ స్థలం ఏపీఎఫ్‌డీసీకి చెందినదని సంబంధితశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థల వివాదం కారణంగా పనులు ప్రారంభంకాలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020లో ఆస్పత్రి భవనాల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నిర్మాణాలకు సంబంధించి 30 పడకల నుంచి 50 పడకల స్థాయి పెంపునకు రూ.మూడు కోట్లు, 50 పడకలు నుంచి 100 పడకల స్థాయి పెంపునకు రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. అదే ఏడాది టెండర్‌ ద్వారా నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌ నిర్మాణ పనులను సొంతం చేసుకుంది. నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులకు అప్పగించింది. 2022 ఫిబ్రవరి ఒకటో తేదీన 4.5 ఎకరాల సెరీకల్చర్‌ స్థలాన్ని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం అప్పగించడంతో పనులు ప్రారంభమయ్యాయి. స్థలం కేటాయింపు ఆలస్యం కావడం వల్ల కాలపరిమితిని పెంచి మార్చి 2024 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని ఒప్పందం కుదిరింది.

ఆది నుంచి నత్తనడకన పనులు

ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణాలు ప్రారంభం నుంచి నత్తనడకన సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో తీవ్ర జాప్యం చేయడం వల్ల పనులు వేగవంతం కాలేదు. నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌ నిర్వాహకులు వంద పడకల ఆస్పత్రిని సుమారు రూ.12 కోట్లు వెచ్చించి 50 శాతం పనులు పూర్తి చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం సుమారు రూ.8 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడం వల్ల సుమారు 11 నెలలుగా మొక్కుబడిగా అతి తక్కువ మందితో నిర్మాణ పనులు కొనసాగిస్తూ వచ్చారు. రెండు నెలల క్రితం ఈ పనులను పూర్తిగా నిలిపివేశారు.

అవస్థలు పడుతున్న వైద్యులు, రోగులు

చింతపల్లి వంద పడకల ఆస్పత్రిని నిర్వహిస్తున్న ప్రస్తుత భవనంలో వైద్యులు, రోగులు వసతి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకే గదిలో నలుగురు వైద్యులు కూర్చొని రోగులకు సేవలందిస్తున్నారు. వైద్యులు చికిత్స అందించేందుకు అవసరమైన గదులు, రోగులకు సరిపడిన వార్డులు లేవు. చిన్నగదిలోనే ఆపరేషన్‌ థియేటర్‌ నిర్వహిస్తున్నారు. ల్యాబ్‌ల నిర్వహణకు కూడా గదులు లేక ఇబ్బంది పడుతున్నారు.

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆస్పత్రి నిర్మాణ పనులు ముందుకు సాగుతాయని ఈ ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం బిల్లుల విడుదలలో జాప్యం వల్ల నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 11:43 PM