ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డునపడ్డ అభిజిత్‌ కార్మికులు

ABN, Publish Date - Oct 20 , 2024 | 01:00 AM

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో గల అభిజిత్‌ ఫెర్రో ఎల్లాయీస్‌ కర్మాగారం లేఆఫ్‌ ప్రకటించడంతో వందలాది మంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డునపడ్డారు. రెండు నెలల్లో పరిస్థితులు చక్కబడతాయని, అప్పటివరకూ సగం జీతం ఇస్తామని యాజమాన్యం చెబుతోంది. తమకు 26 రోజుల జీతం ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

అభిజిత్‌ కర్మాగారం

విద్యుత్‌ బకాయిలు పేరుకుపోవడం,

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడమే లేఆఫ్‌నకు కారణమంటున్న యాజమాన్యం

కార్మికుల ఆందోళన

వెంటనే కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్‌

అచ్యుతాపురం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో గల అభిజిత్‌ ఫెర్రో ఎల్లాయీస్‌ కర్మాగారం లేఆఫ్‌ ప్రకటించడంతో వందలాది మంది ఉద్యోగులు, కార్మికులు రోడ్డునపడ్డారు. రెండు నెలల్లో పరిస్థితులు చక్కబడతాయని, అప్పటివరకూ సగం జీతం ఇస్తామని యాజమాన్యం చెబుతోంది. తమకు 26 రోజుల జీతం ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

సెజ్‌లో అభిజిత్‌ కర్మాగారానికి అప్పట్లో ఏపీఐఐసీ 90.22 ఎకరాలు కేటాయించింది. 2010లో కర్మాగారం నిర్మాణం పూర్తయింది. 2012 జూలైలో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ కర్మాగారంలో 350 మంది శాశ్వత ఉద్యోగులు, సుమారు 900 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. కర్మాగారం ప్రారంభం నుంచి చిన్నచిన్న ఒడిదుడుకులు వచ్చినా ఎప్పుడూ లేఆఫ్‌ పరిస్థితి రాలేదు. తెలుగుదేశం హయాంలో విద్యుత్‌ యూనిట్‌ ధర రూ.4.25 ఉండగా, గత వైసీపీ ప్రభుత్వం దానిని రూ.6.05కి పెంచింది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఫెర్రో ఉత్పత్తులకు డిమాండ్‌ ఉండడంతో అలాగే నెట్టుకొచ్చింది. కానీ గత నాలుగు నెలల నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లో ఫెర్రో ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గింది. అభిజిత్‌ కర్మాగారంలో రోజుకు 800 టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ టన్ను ఉత్పత్తికి రూ.84 వేలు అవుతుండగా, గతంలో అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షల ధర లభించేది. ప్రస్తుతం అది రూ.72 వేలకు పడిపోయింది. దీంతో కర్మాగారం గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుంది. టన్నుకు రూ.12 వేలు నష్టపోవలసి వస్తోంది. దీనికి తోడు విద్యుత్‌ బకాయిలు రూ.180 కోట్లకు చేరుకున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి యూనిట్‌కు సుమారు రూ.9.5 చొప్పున సర్‌చార్జీ కర్మాగారానికి రావలసి ఉంది. కానీ గత ప్రభుత్వం దీనిని కర్మాగారానికి విడుదల చేయలేదు. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం సర్‌చార్జీల కింద సుమారు రూ.150 కోట్లు రావాల్సి ఉందని తెలిసింది. పూర్తి విద్యుత్‌ బకాయిలు చెల్లిస్తే తప్ప సర్‌చార్జీలు విడుదల చేయలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఒకపక్క విద్యుత్‌ బకాయిలు పేరుకుపోవడం, మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గడంతో లేఆఫ్‌ ప్రకటించక తప్పలేదని యాజమాన్యం చెబుతోంది. రెండు నెలల్లో అన్నీ సర్దుకుంటాయని, అప్పుడు కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తామని అంటోంది. అప్పటివరకూ 15 రోజుల జీతం ఇస్తామంటోంది. అందుకు ఉద్యోగులు, కార్మికులు అంగీకరించడం లేదు. తమకు ఈ రెండు నెలలు 26 రోజులకు వేతనం చెల్లించాలని, అనంతరం కర్మాగారాన్ని పునఃప్రారంభిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు నాలుగు రోజులుగా కర్మాగారం ఎదుట ఆందోళన చేస్తున్నారు. కార్మికులకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

Updated Date - Oct 20 , 2024 | 01:00 AM