ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నగర పంచాయతీగా అచ్యుతాపురం!

ABN, Publish Date - Nov 18 , 2024 | 01:05 AM

తెలుగుదేశం పార్టీ గతంలో (2014-19) అధికారంలో వున్నప్పుడు అచ్యుతాపురాన్ని నగర పంచాయతీగా చేయాలని నిర్ణయించారు. ఇది ప్రతిపాదనల దశలో వుండగా వైసీపీ అధికారంలోకి వచ్చింది.. నగర పంచాయతీ ప్రతిపాదన మూలనపడింది. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా దీని గురించి పట్టించుకోలేదు. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అచ్యుతాపురం నగర పంచాయతీ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.

ఎస్‌ఈజడ్‌తో శరవేగంగా అభివృద్ధి

గత టీడీపీ హయాంలోనే ప్రతిపాదనలు

చోడపల్లి, జంగులూరు, భోగాపురం, వెదురువాడ పంచాయతీలను కూడా కలపాలని నిర్ణయం

కార్యరూపం దాల్చేసమయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ

ఐదేళ్లపాటు అటకెక్కిన ప్రతిపాదనలు

తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో కదలిక

అచ్యుతాపురం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ గతంలో (2014-19) అధికారంలో వున్నప్పుడు అచ్యుతాపురాన్ని నగర పంచాయతీగా చేయాలని నిర్ణయించారు. ఇది ప్రతిపాదనల దశలో వుండగా వైసీపీ అధికారంలోకి వచ్చింది.. నగర పంచాయతీ ప్రతిపాదన మూలనపడింది. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా దీని గురించి పట్టించుకోలేదు. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అచ్యుతాపురం నగర పంచాయతీ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురంలో జనాభా గణనీయంగా పెరుగున్నది. ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఇప్పటికే పలు కంపెనీలు, పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తులను ప్రారంభించాయి. మరికొన్ని పరిశ్రమలు నిర్మాణ దశలో వుండగా, రానున్న కాలంలో పలు రకాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే వున్న కంపెనీలు, పరిశ్రమల్లో వేలాది మంది ఉద్యోగులుగా, కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎస్‌ఈజడ్‌లో పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే ఉద్యోగులు, కార్మికులు లక్షలకు చేరుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వారిలో అత్యధిక శాతం మంది స్థానికంగా సొంత నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, లేదంటే అద్దె ఇళ్లల్లో వుంటున్నారు. దీంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగి కొంతమంది స్థానికులు కొత్తగా ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో వివిధ రకాల వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటవుతున్నాయి. ఇంకా అనుబంధ రంగాలు, వివిధ రకాల వృత్తి నిపుణులు కూడా ఇక్కడ పెరుగుతున్నారు. ఈ కారణాల వల్ల అచ్యుపురంలో జనాభా గణనీయంగా పెరుగుతున్నది.

ప్రత్యేక ఆర్థిక మండలి కారణంగా అచ్యుతాపురం ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని పదేళ్ల క్రితమే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించింది. అచ్యుతాపురాన్ని నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేయాలని 2018లో ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై జిల్లా అధికారులు నివేదిక తయారు చేసేలోగా ఎన్నికలు జరిగి, వైసీపీ అధికారంలోకి వచ్చింది. నగర పంచాయతీ ప్రతిపాదనను అటకెక్కించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అచ్యుతాపురం నగర పంచాయతీ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది.

ఐదు గ్రామ పంచాయతీలతో..

వాస్తవంగా అచ్యుతాపురం పంచాయతీ పరిధి చాలా తక్కువే! చోడపల్లి, జంగులూరు, భోగాపురం, వెదురువాడ పంచాయతీలు అచ్యుతాపురానికి ఆనుకుని వుండడంతో ఈ ప్రాంతమంతా ఒక పట్టణంలా అభివృద్ధి చెందుతున్నది. దీంతో ఈ ఐదు పంచాయతీలను కలిసి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేయాలని నాటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో దీని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వుండడంతో నగర పంచాయతీ ఏర్పాటుపై కదలిక వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. అధికారులు గణాంకాల ప్రకారం అచ్యుతాపురం, చోడపల్లి, జంగులూరు, భోగాపురం, వెదురువాడ పంచాయతీల్లో జనాభా 50 వేల వరకు వుంటుందని అంచనా. రానున్న రోజుల్లో ప్రత్యేక ఆర్థిక మండలిలో ఎన్‌టీపీసీ భారీ గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సుమారు 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్‌ఈజడ్‌లో మరెన్నో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో రానున్న ఐదేళ్ల కాలంలో ఇక్కడ జనాభా లక్షకు చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 18 , 2024 | 01:05 AM