ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభిజిత్‌ కార్మికుల ఆందోళన వాయిదా

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:44 AM

అభిజిత్‌ ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీ వద్ద వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.

అభిజిత్‌ కంపెనీ ముందు సమావేశమైన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు

మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని యాజమాన్యానికి అల్టిమేటం

లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

అచ్యుతాపురం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అభిజిత్‌ ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీ వద్ద వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉదయం కర్మాగారం ముందు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. అభిజిత్‌ ఫెర్రో అల్లాయిస్‌ కర్మాగారం యాజమాన్యం ఈ నెల 14వ తేదీ నుంచి లేఆఫ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కార్మికులు కర్మాగారం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ ఎదుట మోకాళ్లపై నిల్చుని, వంటావార్పు వంటి కార్యక్రమాలతోపాటు అచ్యుతాపురం జంక్షన్‌, తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళనలు చేశారు. అయినా కర్మాగారం యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆందోళననున మూడు రోజులపాటు తాత్కాలికంగా వాయిదా వేసి, సమస్యను పరిష్కరించని పక్షంలో ఆందోళనను ఉధృతం చేయాలని తీర్మానించారు.

Updated Date - Oct 22 , 2024 | 12:44 AM