ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎయిర్‌పోర్టుకు 27వ ర్యాంకు

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:50 AM

దేశంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే విమానాశ్రయాల జాబితాలో విశాఖపట్నం విమానాశ్రయం 2023-24 సంవత్సరానికి 27వ ర్యాంకు సాధించింది.

  • 2023-24 సంవత్సరంలో ప్రయాణికుల రాకపోకల ఆధారంగా ర్యాంకులు విడుదల చేసిన ఎయిర్‌పోర్ట్సు అథారిటీ

  • 45వ స్థానంలో విజయవాడ, 46వ స్థానంలో తిరుపతి

  • 2018-19లో 28.53 లక్షల ప్రయాణికులతో 19వ స్థానంలో విశాఖ విమానాశ్రయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేశంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే విమానాశ్రయాల జాబితాలో విశాఖపట్నం విమానాశ్రయం 2023-24 సంవత్సరానికి 27వ ర్యాంకు సాధించింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో తొలి 50 విమానాశ్రయాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు స్థానం సాధించాయి. అందులో విశాఖ 27వ స్థానం, విజయవాడ 45, తిరుపతి 46వ స్థానం దక్కించుకున్నాయి.

విశాఖపట్నం విమానాశ్రయం 2018-19 సంవత్సరంలో 28.53 లక్షల మంది ప్రయాణికులతో 19వ స్థానంలో ఉంది. ఆ తరువాత కరోనా వల్ల విమానాలతో పాటు ప్రయాణికుల సంఖ్య కూడా బాగా తగ్గిపోవడంతో ర్యాంకింగ్‌ క్రమంగా పడిపోయింది. 2019-20లో 24వ ర్యాంకు, 2021-22లో 21, 2022-23లో 26వ ర్యాంకుకు దిగజారింది. 2023-24లో మరో స్థానం తగ్గి 27కు చేరింది.

విశాఖ విమానాశ్రయం నుంచి 2022-23లో 9,66,383 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, 2023-24లో అది 10,62,506కు చేరింది. వార్షిక వృద్ధి రేటు 9.9 శాతం ఉన్నప్పటికీ మిగిలిన విమానాశ్రయాల్లో ఈ పెరుగుదల ఇంకా అధికంగా ఉండటంతో విశాఖ స్థానం తగ్గిపోయింది. పొరుగునే ఉన్న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ విమానాశ్రయం 46,00,615 మంది ప్రయాణికులతో 14వ స్థానం దక్కించుకుంది. భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి అంతకుముందు ఏడాది 36,24,905 మంది ప్రయాణించారు. వార్షిక వృద్ధి రేటు అక్కడ 26.9 శాతం నమోదైంది. విశాఖ కంటే 1.7 రెట్లు అధికం.

- విజయవాడ విమానాశ్రయం 2023-24లో 10,62,506 మంది ప్రయాణికులతో 45వ స్థానం, తిరుపతి విమానాశ్రయం 8,70,662 మందితో 46వ స్థానం దక్కించుకున్నాయి. అన్ని విమానాశ్రయాల్లో 2023-24లో ప్రయాణికుల సంఖ్య పెరగగా, తిరుపతిలో అంతకు ముందు ఏడాది కంటే తక్కువ నమోదుకావడం గమనార్హం. 2022-23లోనే తిరుపతి నుంచి 9,19,267 మంది ప్రయాణించారు. ఆ తరువాత ఏడాది వారి సంఖ్య 48,605 తగ్గిపోయింది.

Updated Date - Nov 20 , 2024 | 12:50 AM