ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనకాపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

ABN, Publish Date - Jun 18 , 2024 | 01:21 AM

అనకాపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సీఎం రమేశ్‌

కొత్తూరు(అనకాపల్లి), జూన్‌ 17 : అనకాపల్లి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రైవేటు కన్వెన్షన్‌ హాలులో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఉత్తరాంధ్రలో ఉన్న 5 పార్లమెంటు స్థానాల్లో అనకాపల్లి నుంచి తాను అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఈ విజయాన్ని అందించిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఈ విజయంతో ఆగిపోకుండా జిల్లాలో ఉన్న ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ, మున్సిపాలిటీలలో సైతం బీజేపీ గెలవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకూ తగిన గుర్తింపు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ బీజేపీ పటిష్టతకు, నిర్మాణానికి మరింత కృషి చేయాలన్నారు. ఎంపీ సీఎం రమేశ్‌ సహకారంతో బీజేపీని విస్తరించాలని నరేంద్రమోదీ, అమిత్‌షా సూచించినట్టు చెప్పారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి కర్రి చిట్టిబాబు, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, పొన్నగంటి అప్పారావు, సురేంద్రమోహన్‌, పుట్టా గంగయ్య, శ్రీరామమూర్తి, రెడ్డి పావని, బీజేపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌ వెన్నా శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2024 | 01:21 AM

Advertising
Advertising