ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏడాది పాప అపహరణకు యత్నం!

ABN, Publish Date - Nov 14 , 2024 | 12:56 AM

ఏడాది పాపను అపహరించేందుకు ఇద్దరు మహిళలు యత్నించారు. అడ్డుకున్న ఆమె తల్లిపై హత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి గాజువాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీతారామనగర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

13 జిడబ్ల్యూకె 2: బాధిత మహిళ ఎన్‌.పద్మ

ఇంట్లోకి చొరబడిన ఇద్దరు మహిళలు

ప్రతిఘటించిన ఆమె తల్లిపై హత్యాయత్నం

గాజువాక, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

ఏడాది పాపను అపహరించేందుకు ఇద్దరు మహిళలు యత్నించారు. అడ్డుకున్న ఆమె తల్లిపై హత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి గాజువాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సీతారామనగర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతారామనగర్‌లో ఎన్‌.నాగేశ్వరరావు, ఎన్‌.పద్మ (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఏడాది వయసు కలిగిన కుమార్తె ఉంది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై ఆమె ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నాగేశ్వరరావు ఇంట్లో లేరు. వచ్చిన ఇద్దరిలో ఒకరు పద్మను గట్టిగా పట్టుకోగా, ఆమె చేతిలో ఉన్న కుమార్తెను తీసుకునేందుకు మరొకరు యత్నించారు. తన కుమార్తెను గట్టిగా పట్టుకుని వదలకపోవడంతో పాపను అపహరించేందుకు వచ్చిన మహిళలు బ్లేడ్‌తో పద్మ మెడపై గాయపర్చారు. ఆమె చేతిపై కూడా గాయమైంది. ఈ సమయంలో పద్మ పెద్దగా కేకలు వేయడంతో ఇద్దరు మహిళలు వాహనంపై పరారయ్యారు. వారిద్దరూ రెండు రోజుల నుంచి ఇదే మార్గంలో తిరుగుతున్నారని, మంగళవారం రాత్రి మాత్రం నేరుగా ఇంటికి వచ్చి పాపను అపహరించేందుకు యత్నించారని పద్మ తెలిపింది. దీనిపై గాజువాక పోలీసులకు పద్మ సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 12:56 AM