ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయిపై ఉక్కుపాదం

ABN, Publish Date - Nov 30 , 2024 | 01:09 AM

గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • త్వరలో విశాఖ కేంద్రంగా ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

  • ప్రభుత్వం ప్రకటన

  • గంజాయి, డ్రగ్స్‌పైనే ప్రత్యేకంగా నిఘా

  • సమాచారం కోసం 1972 టోల్‌ఫ్రీ నంబర్‌

(విశాఖపట్నం-ఆంఽద్రజ్యోతి)

గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు విశాఖలో కూడా ‘ఈగల్‌’ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించింది.

విశాఖ ఏజెన్సీలో సాగవుతున్న గంజాయి రాష్ట్రంతోపాటు దేశ, విదేశాలకు సరఫరా అవుతోంది. గంజాయి వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతోంది. గంజాయి మత్తులో యువత చోరీలకు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో నేరాల పెరుగుదలకు గంజాయి ప్రధాన కారణంగా మారుతోంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. తాము అధికారంలోకి వస్తే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకుడు నారా లోకేశ్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. ఆనాడు చెప్పినట్టుగానే గంజాయి సాగు, విక్రయం, రవాణా, వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఐజీ స్థాయి అధికారి సారథ్యంలో ‘ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌’ (ఈగల్‌)ను తాజాగా ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో మంగళగిరి కేంద్రంగా నార్కోటిక్‌ పోలీస్‌ స్టేషన్‌, విశాఖ, పాడేరు, అమరావతిలో స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈగల్‌ సెల్‌ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించింది. నార్కోటిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ స్థాయి అధికారి ఇన్‌చార్జిగా ఉంటే, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ స్టేషన్లలో సీఐ స్థాయి అధికారులు, జిల్లా కేంద్రాల్లోని ఈగల్‌ సెల్‌లో ఎస్‌ఐ స్థాయి అధికారులను ఇన్‌చార్జులుగా నియమించే అవకాశం ఉంది. ‘ఈగల్‌’ బృందాలు కేవలం డ్రగ్స్‌, గంజాయిపైనే నిఘా ఉంచడం, దాడులు చేయడం చేస్తాయి. ఎవరైనా డ్రగ్స్‌, గంజాయి విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నా, చివరకు వినియోగిస్తున్నా సరే సమాచారం అందించేందుకు వీలుగా 1972 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి అడ్డుకట్ట పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఏజెన్సీలో సాగవుతున్న గంజాయిని స్మగ్లర్లు ఏదో ఒక మార్గంలో నగరానికి తీసుకువస్తున్నారు. ఏజెన్సీ నుంచి వచ్చే మార్గాల్లో నగర సరిహద్దులో ఉండే దువ్వాడ, పెందుర్తి వంటి ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని అక్కడ నిల్వ చేస్తున్నారు. కొందరు నగరంలోకి తీసుకొచ్చి హోటళ్లు, అద్దె ఇళ్లలో ఉంచుతున్నారు. ఒకవిధంగా చెప్పుకోవాలంటే గంజాయి స్మగర్లు గంజాయిని ఇతర నగరాలు, రాష్ట్రాలకు తరలించేందుకు నగరాన్ని ఒక ట్రాన్సిట్‌ హాల్ట్‌ మాదిరిగా తయారుచేసుకున్నారు. నగరంలోకి చేర్చిన గంజాయిని అదను చూసుకుని రైళ్లు బస్సులు, కొరియర్‌, ప్రత్యేక వాహనాల ద్వారా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలో కూడా గంజాయి లభ్యత, వినియోగం పెరిగిపోయాయి. గంజాయి మత్తులో వారంతా నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పట్టపగలే గంజాయి సేవించి రోడ్డుపై వచ్చిపోయే వారిపై దాడులు చేస్తుండడంతో నగరవాసులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. గత కొద్దిరోజులుగా నగరంలో పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడుతోంది. ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అందుబాటులోకి వస్తే నగరం మీదుగా గంజాయిని రవాణా చేస్తున్న స్మగ్లర్లు, వ్యాపారులతోపాటు గంజాయి వినియోగదారులకు చుక్కలు కనిపించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Nov 30 , 2024 | 01:09 AM