ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఖరీఫ్‌ కళ

ABN, Publish Date - Jul 27 , 2024 | 01:03 AM

అల్పపీడనం, వాయుగుండం వర్షాలతో మండలంలో ఖరీఫ్‌ వరి నాట్లు ప్రారంభమయ్యాయి. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,025 హెక్టార్లలో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. వరినారు సిద్ధంగా ఉండడంతో గ్రామాలలో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. మండలంలోని మేడివాడ, రావికమతం, పెద్దిరాజు, మత్స్యపురం, గుమ్మాళ్లపాడుల్లోని చెరువుల్లో తాజాగా కురుస్తున్న వర్షాలకు పుష్కలంగా నీరు చేరింది. ఈ వర్షాలకు రైతులు దమ్ములు ప్రారంభించి వరి నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది కల్యాణపులోవ రిజర్వాయర్‌ నీటిని ఆగస్టు ఐదున ఆయకట్టు భూములకు విడుదల చేసేవారు. అయితే ఈ ఏడాది వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదలకు ముందుగానే దమ్ములు పట్టి, వరి నాట్లు ప్రారంభించేశారు.

కొమిర గ్రామంలో పొలాల్లో దమ్ము చేస్తున్న ట్రాక్టర్‌

వరి నాట్లు ఆరంభం

వర్షాలకు నిండిన చెరువులు

దమ్ములు పడుతున్న రైతులు

వ్యవసాయ పనుల్లో అన్నదాతలు బిజీబిజీ

రావికమతం, జూలై 26: అల్పపీడనం, వాయుగుండం వర్షాలతో మండలంలో ఖరీఫ్‌ వరి నాట్లు ప్రారంభమయ్యాయి. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,025 హెక్టార్లలో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. వరినారు సిద్ధంగా ఉండడంతో గ్రామాలలో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. మండలంలోని మేడివాడ, రావికమతం, పెద్దిరాజు, మత్స్యపురం, గుమ్మాళ్లపాడుల్లోని చెరువుల్లో తాజాగా కురుస్తున్న వర్షాలకు పుష్కలంగా నీరు చేరింది. ఈ వర్షాలకు రైతులు దమ్ములు ప్రారంభించి వరి నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది కల్యాణపులోవ రిజర్వాయర్‌ నీటిని ఆగస్టు ఐదున ఆయకట్టు భూములకు విడుదల చేసేవారు. అయితే ఈ ఏడాది వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదలకు ముందుగానే దమ్ములు పట్టి, వరి నాట్లు ప్రారంభించేశారు. కల్యాణపులోవ నీరు వదిలే అవసరం ఉండకపోవచ్చునని రైతులు అంటున్నారు. వర్షపు నీటితోనే చాలా వరకు దమ్ములు పూర్తి కావచ్చునని వారంటున్నారు. అయితే రిజర్వాయర్‌ ఆయకట్టు దిగువ భూముల్లో నాట్లుకు ఇంకా వరి ఆకులు ఎదగలేదని అక్కడ రైతులు దమ్ములు ప్రారంభించలేదు. రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉన్నందున ఎప్పుడైనా నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కల్యాణపులోవ ఏఈ సత్యనారాయణదొర తెలిపారు. ఇక వర్షాధారం, చెరువుల ఆధారమైన మేడివాడ, గర్నికం, రావికమతం, గుమ్మాళ్ళపాడు, కొమిర, మత్స్యపురం, బుడ్డిబంద, కవ్వగుంట తదితర గ్రామాలలో రైతులు దమ్ములు చేసి వరినాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు.

Updated Date - Jul 27 , 2024 | 01:03 AM

Advertising
Advertising
<