ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐటీడీఏ పీవో చొరవతో కేజీహెచ్‌కు ఆశ్రమ విద్యార్థి

ABN, Publish Date - Nov 30 , 2024 | 10:45 PM

అనారోగ్యానికి గురైన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఐటీడీఏ పీవో అభిషేక్‌ చొరవతో విశాఖ కేజీహెచ్‌కు శనివారం తరలించారు.

జిల్లా ఆస్పత్రిలో విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌

అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి

వైద్య పరీక్షల్లో గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ

కేజీహెచ్‌కు రిఫర్‌ చేసిన వైద్యులు

తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాకరణ

పీవో దృష్టికి తీసుకెళ్లిన యాజమాన్యం

వెంటనే పీవో ఆస్పతికి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి కేజీహెచ్‌కు తరలింపు

పాడేరురూరల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యానికి గురైన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఐటీడీఏ పీవో అభిషేక్‌ చొరవతో విశాఖ కేజీహెచ్‌కు శనివారం తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ముంచంగిపుట్టు మండలం బాబుసాల పంచాయతీ గాజులబంద గ్రామానికి చెందిన గొల్లరి వంశీ(14) అనే విద్యార్థి పాడేరు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల-2లో 9వ తరగతి చదువుతున్నాడు. బలహీనంగా ఉన్న విద్యార్థి రక్తహీనతతో బాధపడుతున్నాడేమోనని భావించిన పాఠశాల యాజమాన్యం శనివారం వంశీని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల్లో విద్యార్థి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించి విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. విశాఖ తీసుకువెళ్లేందుకు విద్యార్థి తల్లిదండ్రులు నిరాకరించడంతో పాఠశాల యాజమాన్యం విషయాన్ని ఐటీడీఏ పీవో వి. అభిషేక్‌ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన ఆయన ఆస్పత్రికి చేరుకొని సూపరింటెండెంట్‌ విశ్వామిత్ర, ఏటీడబ్ల్యూవో వెంకటరమణతో మాట్లాడారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఒప్పించి అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు పంపించారు. ట్రైబల్‌ సెల్‌ వైద్యులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి వంశీకి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. విద్యార్థి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వసతిగృహ నిర్వాహకుడు రాంబాబును విద్యార్థి వెంట కేజీహెచ్‌కు పంపించారు.

Updated Date - Nov 30 , 2024 | 10:45 PM