ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళా ప్రయాణికులపై దాడి

ABN, Publish Date - Nov 30 , 2024 | 01:10 AM

ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలపై ఓ వ్యక్తి గుర్తుతెలియని ద్రావకం పోసి పారిపోయాడు.

  • ద్రావకం పోసి పరారైన గుర్తు తెలియని వ్యక్తి

  • యాసిడ్‌ దాడిగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో కలకలం

  • కళ్లు మండుతున్నాయని బాధితులు చెప్పడంతో ఆస్పత్రికి తరలింపు

  • యాసిడ్‌ కాదని పోలీసుల నిర్ధారణ

కంచరపాలెం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలపై ఓ వ్యక్తి గుర్తుతెలియని ద్రావకం పోసి పారిపోయాడు. అయితే అది యాసిడ్‌ దాడిగా సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే...శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి గిడిజాల బయలుదేరింది. కంచరపాలెం ఐటీఐ జంక్షన్‌ దగ్గరకు వచ్చేసరికి ఓ వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడంటూ ముగ్గురు మహిళా ప్రయాణికులు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్‌ బస్సును నిలిపి, వారిని స్థానికుల సహాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం సీఐ చంద్రశేఖర్‌ ఘటనా స్థలానికి చేరుకుని జల్లిన ద్రవం యాసిడా? మరేదైనా? అని పరీక్షించారు. బాధితులు కళ్లు మంట పెడుతున్నట్టు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి పంపించారు. దాడికి పాల్పడిన వ్యక్తి వెంటనే అక్కడ నుంచి పరారవ్వడంతో పోలీసులు సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ హడావిడి కారణంగా రోడ్డు మధ్యలో బస్సు ఆగిపోవడంతో గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ విషయంపై కంచరపాలెం పోలీసులను ప్రశ్నించగా యాసిడ్‌ దాడి కాదని పేర్కొన్నారు. మహిళలు కళ్లు మంటగా ఉన్నాయని చెప్పడంతో వైద్యం కోసం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీగా సత్తిబాబు

వుడా ఎస్టేట్‌ అధికారిణిగా శాంతి

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న సీహెచ్‌ సత్తిబాబును జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించింది. అలాగే వీఎంఆర్‌డీఏ ఎస్టేట్‌ అధికారిగా బొడ్డేపల్లి శాంతి, భూసేకరణ ఎస్డీసీగా బి.దయానిధి, ఏపీఐఐసీ భూసేకరణ ఎస్డీసీగా పి.కృష్ణమూర్తి, సివిల్‌ డిఫెన్స్‌ ఎస్డీసీగా హెచ్‌వీ జయరాం, హెచ్‌పీసీఎల్‌ భూసేకరణ ఎస్డీసీగా సనపల సుధాసాగర్‌, 16వ నంబర్‌ జాతీయ రహదారుల విభాగం ఎస్డీసీగా జె.సీతారామ్‌, కేజీహెచ్‌ పాలనాధికారిగా బీవీ రమణ, మైనారిటీ కార్పొరేషన్‌ ఈడీగా షామున్నీసా బేగమ్‌ నియమితులయ్యారు. అయితే వీఎంఆర్‌డీఎలో కీలకమైన సెక్రటరీ పోస్టును ఇంకా భర్తీ చేయలేదు. ఈ పోస్టుకు పలువురు పోటీ పడుతున్నారు

Updated Date - Nov 30 , 2024 | 01:12 AM