నేడు ఏయూ పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనం
ABN, Publish Date - Dec 07 , 2024 | 01:17 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనం శనివారం ఆర్కే బీచ్ రోడ్డులోని వర్సిటీ కన్వెన్షన్ హాలులో జరగనున్నది.
దేశ, విదేశాల నుంచి సుమారు రెండు వేల మంది రాక
ముఖ్య అతిథిగా ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం, గౌరవ అతిథిగా పద్మశ్రీ డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణ, విశిష్ట అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరు
విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనం శనివారం ఆర్కే బీచ్ రోడ్డులోని వర్సిటీ కన్వెన్షన్ హాలులో జరగనున్నది. ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి సుమారు రెండు వేల మంది పూర్వ విద్యా ర్థులు హాజరుకానున్నారు. వేడుకలకు నేరుగా హాజరు కాలేని వారి కోసం లైవ్ టెలీకాస్ట్ ఇవ్వనున్నారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వ హించేందుకు ఏయూ అధికారులతోపాటు పూర్వ విద్యార్థుల సంఘం (ఏఏఏ) ప్రతి నిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులు, ప్రముఖులను ఆహ్వానించేందుకు, వారిని విభాగాలు, వేడుకలు జరిగే ప్రాంగ ణానికి తీసుకువెళ్లేందుకు, ఇంకా కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ స్నాక్స్ పంపిణీ, గుర్తింపు కార్డులు పరిశీలించి లోపలకు పంపించేందుకు సీనియర్ ఫ్యాకల్టీ 30 మందితో పది కమిటీలను ఏర్పాటు చేశారు.
అతిథులు...
పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్, మేనే జింగ్ డైరెక్టర్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం, గౌరవ అతిథిగా పద్మశ్రీ డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణ, విశిష్ట అతిథిగా విద్యా శాఖా మంత్రి నారా లోకేష్‌తో పాటు పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గ్రంథి మల్లికార్జునరావు, చైర్మన్ డాక్టర్ ఇ.శంకరరావుతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు.
ఇదీ షెడ్యూల్..
బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 5.30 గంటలకు అతిథుల ప్రసంగాలు ప్రారంభమవుతాయి. ఇవి రెండు గంటలు కొనసాగుతాయి. రాత్రి 8 గంటలకు వేడుకలు ముగియనున్నాయి.
Updated Date - Dec 07 , 2024 | 01:17 AM