ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ నిషేధం

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:38 AM

జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో పర్యాటకంపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

పర్యావరణానికి హాని కలిగితే చర్యలు తప్పవు

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరిక

పాడేరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో పర్యాటకంపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక సీజన్‌ ప్రారంభమైందని, పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శిస్తారన్నారు. ఏజెన్సీ ముఖ ద్వారాల వద్ద పర్యాటకుల వాహనాలు, పర్యాటకుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. పర్యాటకులకు తగిన భద్రత కల్పించాలన్నారు. పర్యాటక, అటవీ ప్రాంతాల్లో క్యాంపు ఫైర్‌ నిర్వహించకూడదని, నిర్దేశించిన ప్రదేశాల్లో క్యాంపు ఫైర్‌ నిర్వహించేందుకు ముందుగా అనుమతులు పొందాలన్నారు. పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనధికారికంగా క్యాంపు ఫైర్‌లు నిర్వహిస్తే మహిళా పోలీసులు, వీఆర్‌వోలు, పంచాయతీ కార్యదర్శులు తనిఖీలు చేసి చర్యలు చేపట్టాలన్నారు. పర్యాటక ప్రాంతాల పరిధిలో గ్రామ, మండల, ఐటీడీఏ, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యాటకం నేపథ్యంలో పర్యావరణానికి, అడవులకు హాని కలిగిస్తే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మద్యం బెల్ట్‌ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు

పర్యాటక ప్రదేశాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు, బెల్టు షాపులు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేయాలని అధికారులను కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. పర్యాటకులు ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తే తప్పనిసరిగా హెల్మెట్‌ పెట్టుకోవాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగాన్ని నియంత్రించాలన్నారు. అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండా అటవీ ప్రాంతాల్లోకి పర్యాటకులు ప్రవేశిస్తే కేసులు నమోదు చేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు, హోటళ్లు, రిసార్టులు, టెంటెడ్‌ అకామిడేషన్ల యాజమాన్యాలు తప్పనిసరిగా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటకులు అర లీటరు వాటర్‌ బాటిళ్లు తీసుకురావద్దని, లీటరు, రెండు లీటర్ల వాటర్‌ బాటిళ్లు మాత్రమే వినియోగించాలన్నారు. చెక్‌ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయాలన్నారు. టెంటెడ్‌ అకామిడేషన్ల వద్ద రేటు కార్డులు ఏర్పాటు చేయాలని, పర్యాటకుల నుంచి అధిక వసూళ్లు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. పర్యాటక కేంద్రాల వద్ద గైడ్లను ఏర్పాటు చేయాలని, వారికి శిక్షణ అందించాలని సూచించారు. పర్యాటకులతో గైడ్లు మర్యాదపూర్వకంగా మెలగాలని, పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలియజేసే విధంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్‌ (వర్చువల్‌గా), జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, డీఎఫ్‌వో పీవీ సందీప్‌రెడ్డి, డీఆర్‌వో బి.పద్మావతి, జిల్లా పర్యాటకాధికారి జి.దాసు, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాల సుందరబాబు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జమాల్‌ బాషా, డివిజనల్‌ పంచాయతీ అధికారి పీఎస్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:38 AM