ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బేవాచ్‌ ఇష్టారాజ్యం

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:04 AM

పర్యాటక శాఖకు చెందిన ఆస్తులను కొందరు వైసీపీ నేతలు అక్రమార్జనకు అడ్డాగా మార్చుకున్నారు. గత ఐదేళ్లు ఇష్టానుసారంగా వ్యవహరించిన వారు ఇప్పుడు అదే పంథాలో వెళుతున్నారు. భీమిలి బీచ్‌రోడ్డులో తొట్లకొండకు ఎదురుగా బీచ్‌లో ఏపీటీడీసీ రెస్టారెంట్‌ (బే వాచ్‌) నిర్మించింది.

bay watch

రూమ్‌లు నిర్మించి అడ్డగోలుగా వసూళ్లు

సముద్రం పక్కన స్థలం ఆక్రమణ

ఏపీటీడీసీ నిబంధనలకు తిలోదకాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పర్యాటక శాఖకు చెందిన ఆస్తులను కొందరు వైసీపీ నేతలు అక్రమార్జనకు అడ్డాగా మార్చుకున్నారు. గత ఐదేళ్లు ఇష్టానుసారంగా వ్యవహరించిన వారు ఇప్పుడు అదే పంథాలో వెళుతున్నారు. భీమిలి బీచ్‌రోడ్డులో తొట్లకొండకు ఎదురుగా బీచ్‌లో ఏపీటీడీసీ రెస్టారెంట్‌ (బే వాచ్‌) నిర్మించింది. దానిని లీజుకు ఇచ్చింది. గత ప్రభుత్వంలో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వైసీపీ నాయకులు చాలా స్వల్ప మొత్తానికే దానిని చేజిక్కించుకున్నారు. ఏపీటీడీసీ వారికి రెండు ఎకరాల స్థలంలో గడ్డితో పైకప్పు వేసిన రెస్టారెంట్లు, చిల్డ్రన్‌ ప్లే ఏరియా మాత్రమే అప్పగించింది. వాటిని ఆపరేట్‌ చేస్తూ ఆదాయం పొందాలి. సంస్థకు లీజు కట్టాలి. కానీ వైసీపీ నాయకులు ఆ ప్రాంతం మొత్తం ఆక్రమించారు. అది కోస్తా నియంత్రణ మండలి పరిధిలోని ప్రాంతం. సిమెంట్‌ నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ వారు కొత్తగా అతిథి గృహాలు నిర్మించి, ఒక్కో రూమ్‌ రోజుకు రూ.4 వేలు చొప్పున అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. పిల్లలు క్రికెట్‌ ఆడడానికి కొత్తగా నిర్మాణం చేపట్టారు. బీచ్‌ వైపు స్థలాన్ని ఆక్రమించి కాంక్రీట్‌ నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి ఇవేమీ వారు చేయడానికి వీల్లేదు. ఏపీటీడీసీ ఇచ్చినవే నిర్వహించాలి. వారికి నచ్చినట్టు చేసుకుంటూ పోతున్నా అప్పుడు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఏమీ చేయలేకపోయారు. సదరు నిర్వాహకులు పార్టీ పెద్దలను మెప్పించడానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇక్కడ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు ఆయన పుట్టినరోజు వేడుకలను ఇదే బేవాచ్‌ రిసార్ట్‌లో ఘనంగా నిర్వహించి ఆయన మెప్పు పొందారు. దాంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూసే అవకాశం లేకుండా పోయింది.

మద్యం దుకాణం నిర్వహణ

వైసీపీ ప్రభుత్వంలో అన్ని చోట్ల ప్రభుత్వమే మద్యం విక్రయించింది. పర్యాటక శాఖ అతిథి గృహాల్లో వారికి తక్కువ ధరకు లైసెన్స్‌ ఇచ్చి మద్యం విక్రయించడానికి అనుమతి ఇచ్చారు. ఆ విధంగా బే వాచ్‌లో ఏపీటీడీసీ అనుమతి తీసుకుంది. కానీ దానిని ప్రైవేటు వ్యక్తులు హస్తగతం చేసుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

ఫిర్యాదుతో కదిలిన అధికారులు

వైసీపీ నాయకుల అరాచకాలపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్న జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్‌ ఈ రిసార్ట్‌పై కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. వారు ఏమని నివేదిస్తారో, వారికి కళ్లకు ఈ అక్రమాలు కనిపిస్తాయో లేదో చూడాలి మరి.

Updated Date - Sep 05 , 2024 | 01:04 AM

Advertising
Advertising