ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫార్మా బస్సు ఢీకొని బాలుడి మృతి

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:03 AM

ఓ ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న బాలుడిని బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే తనువు చాలించాడు. జాతీయ రహదారి అగనంపూడి సమీపంలో గల బీసీ కాలనీ వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకొంది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పవన్‌ కుమార్‌ (ఫైల్‌ ఫొటో)

అగనంపూడి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓ ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న బాలుడిని బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే తనువు చాలించాడు. జాతీయ రహదారి అగనంపూడి సమీపంలో గల బీసీ కాలనీ వద్ద శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకొంది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం లక్కవరం శివారు మామిడిపల్లికి చెందిన దొగ్గ దేముళ్ల ఫార్మాసిటీలో ఓ కంపెనీలో పనిచేస్తూ స్థానికంగా కుటుంబంతో కలిసి ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఆయన డ్యూటీకి బయలుదేరారు. తండ్రితో పాటు సమీపంలో గల బస్టాప్‌నకు వెళ్లిన పవన్‌కుమార్‌ (7) జాతీయ రహదారిపై గల డివైడర్‌ను దాటి తిరిగి ఇంటికి వస్తుండగా ఫార్మాసిటీ నుంచి నగరానికి వస్తున్న ఓ ఫార్మా కంపెనీ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. బాలుడి తల పైనుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఘటనా స్థలిలోనే మృతిచెందాడు. పవన్‌కుమార్‌ స్థానికంగా గల ఓప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చుదువుతున్నాడు. తమ కుమారుడిని బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు దేముళ్ల, దేవీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:03 AM