ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు!

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:15 AM

జిల్లాకు మరో భారీ పరిశ్రమ రానున్నది. నక్కపల్లి కేంద్రంగా బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (వీసీఐసీ) కోసం ఏపీఐఐసీ సేకరించి సుమారు రెండు వేల ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో బల్క్‌ డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దీంతో నక్కపల్లి, పరిసర ప్రాంతాలను ఫార్మా హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు కేటాయించిన ఏసీఐఐసీ భూములు

కేంద్ర ప్రభుత్వం ఆమోదం

వీసీఐసీకి సేకరించిన భూముల్లో ఏర్పాటు

రెండు వేల ఎకరాలు కేటాయింపు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహణ

రూ.14 వేల కోట్ల పెట్టుబడులు. 70 వేల మందికి ఉపాధి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాకు మరో భారీ పరిశ్రమ రానున్నది. నక్కపల్లి కేంద్రంగా బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (వీసీఐసీ) కోసం ఏపీఐఐసీ సేకరించి సుమారు రెండు వేల ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో బల్క్‌ డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయనున్నారు. దీంతో నక్కపల్లి, పరిసర ప్రాంతాలను ఫార్మా హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సంక్షేమంతోపాటు అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుండడంతోపాటు, చంద్రబాబునాయుడు దక్షతను చూసి పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు, కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే నక్కపల్లి సెజ్‌లో రూ.62 వేల కోట్లతో 17.8 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం వున్న ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ఆర్సెలర్‌ మిట్టల్‌- నిప్పాన్‌ స్టీల్స్‌ ఇండియా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబునాయుడు గత నెలలో పరవాడ పర్యటన సందర్భంగా ప్రకటించారు. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎ్‌సఐపీబీ) తొలి సమావేశంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై ఆర్సెలర్‌ మిట్టల్‌- నిప్పాన్‌ స్టీల్స్‌ ఇండియా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మరోవైపు ఇదే నక్కపల్లి మండలంలో ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదనలకే పరిమితం చేసి, అటెకెక్కించిన ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నది విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగంగా నక్కపల్లి మండలం బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్‌ పురం, రాజయ్యపేట, వేంపాడులో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కదలిక వచ్చింది.

నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు 2023 సెప్టెంబరు 20న వైసీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ఏర్పాటుకు భూసేకరణ చేపట్టలేదు. వాస్తవానికి బల్క్‌ డ్రగ్‌ పార్కును కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అక్కడ నుంచి అనకాపల్లి జిల్లాకు మార్పు చేసేందుకు గతంలో పెట్టిన ప్రతిపాదనకు కేంద్రం పచ్చజెండా ఊపేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. తాజాగా నక్కపల్లి మండలంలో బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిని పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయాలని ఎన్‌డీఏ ప్రభుత్వం భావిస్తోంది. గతంలో విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం ఏపీఐఐసీ సేకరించి సుమారు రెండు వేల ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో బల్క్‌ డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఏపీఐఐసీ తుది న్యాయ పరిశీలన పూర్తి చేసిన అనంతరం బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు పనులు వేగవంతం కానున్నాయి.

ఫార్మా హబ్‌గా నక్కపల్లి

బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుతో నక్కపల్లి పరిసర ప్రాంతాలను ఫార్మా హబ్‌గా మార్చాలని ఎన్‌డీఏ ప్రభుత్వం భావిస్తున్నది. ఫార్మా రంగంలో సుమారు రూ.14 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. 30 వేల మందికి ప్రత్యక్షంగా, 40 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:15 AM