ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరం కోతకు చెక్‌

ABN, Publish Date - Sep 20 , 2024 | 01:09 AM

ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకూ తీర ప్రాంతంలో కోత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కురుసుర మ్యూజియం వెనుక సముద్ర మట్టానికి మూడు మీటర్ల లోతులో 120 మీటర్ల మేర నిర్మాణం

వీఎంఆర్‌డీ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ సంస్థ ఒప్పందం

ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకూ పలుచోట్ల కోతకు అడ్డుకట్ట

రూ.200 కోట్లతో ప్రతిపాదనలు

విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకూ తీర ప్రాంతంలో కోత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా కురుసుర మ్యూజియం వెనుక కోతను నివారించడానికి ఒక నిర్మాణం చేపట్టదలచింది. ఇప్పటికే తీరంలో కోతపై అధ్యయనం చేసిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చి సంస్థ, వీఎంఆర్‌డీఎ కలిసి ఈ ప్రాజెక్టు చేపడతాయి. అదేవిధంగా ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకూ కోత ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా తగిన చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సుమారు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థకు పంపాలని నిర్ణయించారు.

కురుసుర వెనుక నిర్మాణం....

కురుసుర మ్యూజియం వద్ద తీరం కోత చాలా ఎక్కువగా ఉంది. సుమారు పదేళ్ల క్రితం రెండు పర్యాయాలు అక్కడ బీచ్‌రోడ్డు కోతకు గురైంది. కోత నివారణకు భారీగా బండరాళ్లు వేస్తే కురుసురకు ఉత్తరాన కోత మొదలైంది. ఈ నేపథ్యంలో కురుసుర వెనుక తీరంలో ఒక నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తీరం నుంచి సముద్రంలోకి నీటి మట్టానికి మూడు మీటర్ల లోతున 120 మీటర్ల పొడవు, 20 నుంచి 30 మీటర్ల వెడల్పుతో సిమెంట్‌, కాంక్రీట్‌, స్టీల్‌తో ఒక నిర్మాణం చేపడతారు. దీనివల్ల అలల తీవ్రత తగ్గుతుంది. అదే సమయంలో సముద్రం నుంచి ఇసుక మేటగా వచ్చి బీచ్‌లో చేరుతుంది. ఇప్పటికే పుదుచ్చేరిలో అటువంటి నిర్మాణం చేపట్టగా కోత తగ్గింది. ఇక ఆర్కే బీచ్‌లో కోత తీవ్రంగా ఉన్నప్పటికీ అక్కడ సహజసిద్ధంగా ఉన్న రాళ్లు వల్ల బీచ్‌ సురక్షితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే తరహాలో కురుసుర వద్ద అలల వేగం తగ్గించగలిగితే కోతకు అడ్డుకట్ట వేయవచ్చునని అంచనాకు వచ్చారు.

భీమిలి మునిసిపల్‌ కార్యాలయం వద్ద కోత నివారణకు చర్యలు

భీమిలి మునిసిపల్‌ కార్యాలయం వద్ద కోత ఎక్కువగా ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చ్‌ సంస్థ గుర్తించింది. అక్కడ కూడా కోత నివారణకు చర్యలు తీసుకుంటామని ఈ సంస్థ డైరెక్టర్‌ ఎంవీ రమణమూర్తి వెల్లడించారు. ఇంకా ఫిషింగ్‌ హార్బర్‌కు ఉత్తరాన, భీమిలి వరకూ ఇంకా పలుచోట్ల కోత ఉన్నట్టు తమ పరిశోధనలో వెల్లడైందని, దశలవారీగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకు తీరంలో కోతపై ఇప్పటికే తాము అధ్యయనం చేసినందున కోత నివారణకు వీఎంఆర్‌డీఎతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు

Updated Date - Sep 20 , 2024 | 01:09 AM