ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏవోబీలో ఎదురుకాల్పులు

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:51 PM

ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) గురువారం పోలీసులకు, మావోయిస్టులకు నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతిచెందిగా, ఒక పోలీస్‌కు గాయాలయ్యాయి.

ఎదురుకాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల కిట్‌బ్యాగ్‌లు, తుపాకులు, ఇతర సామగ్రి

మావోయిస్టు మృతి, ఒక పోలీస్‌కు గాయాలు

సీలేరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) గురువారం పోలీసులకు, మావోయిస్టులకు నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతిచెందిగా, ఒక పోలీస్‌కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి ఒడిశా పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెల బ్లాక్‌ పరిధిలోని జినెల్‌గూడా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం అందడంతో బుధవారం నుంచి పోలీసులు (డిస్ట్రిక్‌ వలంటీర్‌ ఫోర్స్‌) గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందగా, డమ్రు బద్రనాయక్‌ అనే పోలీస్‌కు గాయాలయ్యాయి. గాయపడిన పోలీస్‌ను చికిత్స కోసం హెలికాప్టర్‌లో మల్కన్‌గిరి ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన మావోయిస్టు వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఎదురుకాల్పుల అనంతరం తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

Updated Date - Nov 21 , 2024 | 11:51 PM