ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు సీఎం ప్రత్యేక మిషన్‌ ఏర్పాటుచేయాలి

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:55 AM

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక ప్రత్యేక మిషన్‌ ఏర్పాటుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌

డాబాగార్డెన్స్‌, సెప్టెంబరు 20:

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక ప్రత్యేక మిషన్‌ ఏర్పాటుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ప్లాంటులో షెడ్యూల్‌ ప్రకారం ఉత్పత్తి పెంచడం, ముడిసరకు (రా మెటీరియల్‌) సరఫరా, సెయిల్‌లో విలీనం వంటి పనుల నిర్వహణ జరిగేలా ఈ మిషన్‌ చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఎంపీలు, ఉక్కు మంత్రిత్వ శాఖ, ప్లాంట్‌ ఉన్నతాధికారుల భాగస్వామ్యంతో ఈ మిషన్‌ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నం డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్లాంటుకు సంబంధించి ఈ వంద రోజుల్లో రాష్ట్రంలోని కూటమి సర్కారు మాటలకు తగ్గట్టు చేతల్లో నిర్దిష్ట చర్యలేవీ తీసుకోలేదన్నారు. ప్లాంటుకు బొగ్గు సరఫరా చేయకుండా, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ తెరిపించకుండా కార్మికులు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ఆఫీసర్ల జీతాల్లో 30 శాతం కోతపెట్టడం, కాంట్రాక్టు కార్మికులకు 4 నెలలుగా జీతాలివ్వకపోవడం, ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోవడం వంటి దుర్మార్గపు చర్యలకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటోందని విమర్శించారు. కేంద్ర చర్యలపై వామపక్ష పార్టీలను, కార్మిక, ప్రజా సంఘాలను కలుపుకొని సీపీఎం పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:55 AM