లంకెలపాలెం కూడలిలో బొగ్గు లారీ బీభత్సం
ABN, Publish Date - Mar 30 , 2024 | 12:34 AM
జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలి వద్ద శుక్రవారం మఽధ్యాహ్నం బొగ్గు లోడుతో వెళుతున్న లారీ బీభత్సం స్పష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో రెండు కార్లు, ఆటో, ట్రాక్టర్, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
సిగ్నల్ లైట్స్ వద్దకు వచ్చే సరికి బ్రేకులు ఫెయిల్
ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకుపోయిన లారీ
రెండు కార్లు, ఆటో, ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలు ధ్వంసం
ఎనిమిది మందికి తీవ్రగాయాలు
ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం
లంకెలపాలెం, మార్చి 29: జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలి వద్ద శుక్రవారం మఽధ్యాహ్నం బొగ్గు లోడుతో వెళుతున్న లారీ బీభత్సం స్పష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో రెండు కార్లు, ఆటో, ట్రాక్టర్, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలిలో మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో గాజువాక వైపు నుంచి వచ్చే వాహనాలకు రెడ్ సిగ్నల్ పడింది. ఈ క్రమంలో అనకాపల్లి వైపు వెళుతున్న రెండు కార్లు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్, రెండు ద్విచక్ర వాహనాలు ఆగివున్నాయి. ఇదే సమయంలో గంగవరం పోర్టు నుంచి బొగ్గు లోడుతో వేగంగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అప్పటికే సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను, ఎడమ వైపు వున్న కారును బలంగా ఢీకొన్నది. ఈ వాహనాలు.. ముందున్న మిగిలిన వాహనాలను ఢీకొన్నాయి. కారుపైకి ట్రాక్టర్ దూసుకుపోయింది. లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. డివైడర్ రెయిలింగ్ ధ్వంసం కావడంతోపాటు సెంట్రల్ లైటింగ్ స్తంభం కూలిపోయింది. ఈ ప్రమాదంలో బొగ్గు లారీ డ్రైవర్ నిరాజ్‌లాల్‌తోపాటు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న చీడికాడ మండలం చుక్కపల్లికి చెందిన కె.సంతోషి, కె.వెంకటరమణ, పాతగాజువాకకు చెందిన బి.శరణ్య, అగనంపూడికి చెందిన పల్లా శ్రీను జి.హర్ష, జి.కొండయ్య డి.శ్రీనివాసరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో అగనంపూడి ఏరియా ఆస్పతికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. లారీ డ్రైవర్ నిరాజ్‌లాల్, డి.శ్రీనివాసరాజు, కె.వెంకటరమణల పరిస్థితి ఆందోళనకరంగా వుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం కారణంగా గాజువాక నుంచి అనకాపల్లి వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పరవాడ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సాయంతో సుమారు గంటపాటు శ్రమించి తొలగించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పరవాడ పోలీసులు తెలిపారు.
Updated Date - Mar 30 , 2024 | 12:34 AM