ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెండో వారం నుంచి కాఫీ గింజల కొనుగోళ్లు

ABN, Publish Date - Nov 30 , 2024 | 10:38 PM

ఈనెల రెండో వారం నుంచి కాఫీ గింజలను కొనుగోలు చేస్తామని జీసీసీ డివిజినల్‌ మేనేజర్‌ పి. దేవరాజు తెలిపారు.

విలేకరులతో మాట్లాడుతున్న జీసీసీ డీఎం పి. దేవరాజు

కాఫీ రైతులకు గరిష్ఠ ధరలు

ఆలస్యంగా వచ్చిన దిగుబడులు

డీఎం పి.దేవరాజు

చింతపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఈనెల రెండో వారం నుంచి కాఫీ గింజలను కొనుగోలు చేస్తామని జీసీసీ డివిజినల్‌ మేనేజర్‌ పి. దేవరాజు తెలిపారు. కాఫీ రైతులకు గరిష్ఠ ధరలు అందించనున్నట్టు చెప్పారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులు పండించిన కాఫీ గింజలకు జీసీసీ మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తుందన్నారు. కాఫీ ధరలను ఇప్పటికే ప్రకటించడం జరిగిందన్నారు. కిలో పార్చిమెంట్‌ రూ.285, చెర్రీ కిలో రూ.150, రొబస్ట్రా రూ.80 ధరలుగా నిర్ణయించామన్నారు. గిరిజన రైతులు పండించిన ప్రతీ కాఫీ గింజను జీసీసీ కొనుగోలు చేస్తుందన్నారు. ఈఏడాది కాఫీ దిగబడులు ఆలస్యంగా వచ్చాయన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోరాదన్నారు. రైతులు బాగా ఎర్రగా పండిన పండ్లను మాత్రమే సేకరించి పార్చిమెంట్‌గా తయారు చేసుకోవాలన్నారు. పండ్లు, కాయలు కలిపి సేకరించరాదన్నారు. సేకరించిన పండ్లను వెంటనే పల్పింగ్‌ చేసుకోవాలన్నారు. కాఫీ గింజలను సేకరణ సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారన్నారు. విక్రయించిన వెంటనే రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తామన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 10:38 PM